IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం (INDW beat PAKW by 7 Wickets) సాధించింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 108 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. పాక్ మహిళలలో అమీన్ 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇకపోతే భారత మహిళా బౌలర్లలో దీప్తి 3 వికెట్లు తీసుకోగా… రేణుక, పూజ, శ్రేయాంక రెండేసి వికెట్లు దక్కించుకుని పాక్ ను కట్టడి చేయడంలో సఫలం అయ్యారు.
అనంతరం 20 ఓవర్లలో 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన భారత మహిళా జట్టు కేవలం 14.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 109 లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. భారత మహిళా క్రికెటర్లలో స్మ్రితి 45 పరుగులు, షఫాలీ 40 పరుగులతో జట్టుకి విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ లో విజయంతో గ్రూప్ దశలోని పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో మొదటి సంతానంలో నిలిచింది.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: దీప్తి శర్మ ( 4 ఓవర్లలో 20 పరుగులకు 3 వికెట్లు)
భారత్ మహిళలు బోణి (INDW beat PAKW by 7 Wickets):
#TeamIndia triumphs in the #GreatestRivalry! 🇮🇳💙
With an exceptional bowling effort and a strong opening partnership, the #WomenInBlue secure their first win of the #WomensAsiaCup2024, beating Pakistan by 7 wickets! 🔥
Next up 👉 #INDvUAE | SUN, JUL 2, 1:30 PM |… pic.twitter.com/Y8GHHPi5LR
— Star Sports (@StarSportsIndia) July 19, 2024
9th June – India Men’s Senior Team Beat Pakistan's Senior Team in T20WC
13th July – India Legends Beat Pakistan Legends
19th July – India Women Team Beat Pakistan Women Team
Domination Level India 🇮🇳🔥👌🏻#INDvPAK #WomensAsiaCup #ShefaliVerma #INDWvsPAKW pic.twitter.com/Y2OWPTbRLu
— 🏏CricketFeed (@CricketFeedIN) July 19, 2024
ALSO READ: Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు