IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్ డే మ్యాచ్ లో 32 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలయ్యింది (Srilanka beat India in 2nd ODI by 32 runs).
శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 240 పరుగులు చేశారు. శ్రీలంక బ్యాటర్లలో ఆవిష్క ఫెర్నాండో మరియు కమిందు మెండిస్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా… కుశాల్ మెండిస్ 30 పరుగులు, వెళ్లలాగే 39 పరుగులతో జట్టుకి గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు.
భారత్ బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీసుకోగా… కుల్దీప్ రెండు వికెట్లు, సిరాజ్ మరియు అక్షర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన భారత్ లక్ష్య ఛేదనలో చతికిల పడింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇకపోతే ఓపెనర్ గిల్ 35 పరుగులు, అక్షర్ 44 పరుగులు చేయగా తక్కినవారెవ్వరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో భారత్ జట్టు 42.2 ఓవర్లలో కేవలం 208 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది.
ఈ మ్యాచ్ లో విజయంతో శ్రీలంక జట్టు మూడు మ్యాచుల వన్ డే సిరీస్ ను 1-0 తేడాతో ఆధిక్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్ డే మ్యాచ్ టై అయ్యిన విషయం తెలిసినదే.
భారత్ ఓటమి (Srilanka Beat India in 2nd ODI):
SRI LANKA BEAT INDIA IN THE 2ND ODI….!!! pic.twitter.com/MapqO15lMK
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024