Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20 లో తలపడ్డాయి. శ్రీలంక లోని పల్లెకేలే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ సూపర్ ఓవర్ లో (India beat Srilanka in Super Over) విజయం సాధించింది. దీంతో భారత్ టీ20 సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది.
ముందుగా టాస్ ఓడి బ్యాట్టింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ౧౩౭ పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బ్యాట్స్మెన్లలో గిల్ 39 పరుగులు, పరాగ్ 26 పరుగులు సుందర్ 25 పరుగులు మినహా తక్కిన వారెవ్వరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
శ్రీలంక బౌలర్లలో తీక్షణ మూడు వికెట్ లు తీసుకోగా… హాసరంగా రెండు వికెట్లు, చమిందు, ఫెర్నాండో, మెండిస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిస్సంక 26 పరుగులు, కుషాల్ మెండిస్ 43 పరుగులు మరియు వన్ డౌన్ లో వచ్చిన కుశాల్ పేరర 46 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ జట్టు లో మిగిలిన బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో 20 ఓవర్లలో 137 పరుగులు చేసి మ్యాచ్ ను టై గా మిగిలిచారు.
సూపర్ ఓవర్లో ముందుగా బ్యాట్టింగ్ కు చేసిన శ్రీలంక కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్ లు కోల్పోయింది. అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన భారత్… తొలి బంతికే బౌండరీ కొట్టి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్: వాషింగ్టన్ సుందర్
భారత్ విజయం (India beat Srilanka in Super Over):
A thrilling end to a special series 🇮🇳
All fame reaches god 🧿 pic.twitter.com/vcGt8EyARt— Surya Kumar Yadav (@surya_14kumar) July 30, 2024
Surya and GG era begins with the trophy. 🏆
– Captain hands the trophy to Rinku Singh and Riyan Parag. 👌pic.twitter.com/PRakBKlN8o
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2024
Rinku bowling 19th over & Surya bowling 20th over to help India win a game must be one of the craziest things to happen in cricket history 😱 👌 pic.twitter.com/JdNjHlTDjm
— Johns. (@CricCrazyJohns) July 31, 2024
ALSO READ: Paris Olympics 2024: షూటింగ్ లో భారత్ కు మరో రజితం