IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో భారత్ విజయం (India beat England by 68 runs, enters Final) సాధించింది. ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్స్ కు చేరుకుంది.
ముందుగా టాస్ ఓడి బ్యాట్టింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ లు కోల్పోయి 171 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో రోహిత్ 57 పరుగులు, సూర్య కుమార్ 47 పరుగులతో టాప్ స్కోర్లలుగా నిలిచి జట్టుకి మంచి స్కోర్ అందించారు. అయితే మరోసారి కోహ్లీ 9 పరుగులతో నిరాశపరిచాడు అనే చెప్పాలి.
అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రత్యర్థి భారత్ బౌలర్లు అక్షర్, బుమ్రా, కుల్దీప్ దెబ్బకు కుదేలయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 16.4 ఓవర్లలో కేవలం 103 పరులకు అల్ అవుట్ అయ్యారు. ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ చెరో మూడు వికెట్లు తీసుకోగా… బుమ్రా రెండు వికెట్లు తీస్కుని భారత్ కు సునాయాస విజయాన్ని అందించారని చెప్పాలి.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (3 వికెట్లు)
అయితే ఇప్పటికే సెమీఫైనల్స్ లో భాగంగా జరిగిన దక్షిణాఫ్రికా మరియు ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసినదే. దీంతో రేపు అనగా జూన్ ౨౯ న జరగున ఫైనల్స్ లో భారత్ మరియు దక్షిణాఫ్రికా (IND vs SA) పోటీ పడనున్నాయి.
ఇకపోతే టీ౨౦ ప్రపంచకప్ లో భారత్ ఫైనల్స్ కు చేరుకోవడం ఇది మూడో సారి. తొలిసారి ౨౦౦౭ లో భారత్ ఫైనల్స్ లో పాకిస్తాన్ పై గెలిచి కప్ సాధించగా… 2007 లో ఫైనల్స్ లో శ్రీలంక పై ఓడిపోయింది. మరోపక్క టీ20 ప్రపంచకప్ లో ఫైనల్స్ కు చేరుకోవడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఫైనల్ కు భారత్ (India Beat England by 68 runs in Semi Final and enters Final):
𝙄𝙣𝙩𝙤 𝙏𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡𝙨! 🙌 🙌#TeamIndia absolutely dominant in the Semi-Final to beat England! 👏 👏
It's India vs South Africa in the summit clash!
All The Best Team India! 👍 👍#T20WorldCup | #INDvENG pic.twitter.com/yNhB1TgTHq
— BCCI (@BCCI) June 27, 2024