IND vs ENG: గురువారం ధర్మశాల వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది (India vs England 5th Test). ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఉదయం 9:30 నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ మ్యాచ్ లో భారత్ తరపున దేవదత్ పడిక్కల్ కు జట్టులో స్థానం దక్కింది. దేవదత్ పడిక్కల్ కి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం (Devdutt Padikkal Test Debut). అంతేకాదు రవిచంద్రన్ అశ్విన్ కు ఈ మ్యాచ్ 100 టెస్ట్ (Ashwin 100th Test) కావడం గమనించాల్సిన విషయం.ఇకపోతే ఇంగ్లాండ్ తరపున నాలుగో టెస్ట్ కు విశ్రాంతి తీసుకున్న మార్క్ వుడ్ మళ్ళీ ఐదో టెస్ట్ కు జట్టులో చేరాడు.
భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో భారత్ ఇప్పటికే మూడు మ్యాచులను గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసినదే. అయితే ఈ చివరి టెస్ట్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను 4-1 తో సొంతం చేసుకోవాలి అని భారత్ ఉవ్విళూరుతోంది.
మరో పక్క తొలి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించినప్పటికి ఇంగ్లాండ్ ఆ తరువాత భారత్ ఎదురుదాడికి సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాదించాలి అని ఇంగ్లాండ్ ఎదురుచూస్తోంది.
ఐదో టెస్ట్ (IND vs ENG 5th test):
England won the Toss….!!!
Devdutt Paddikal makes his Debut Today 👏#INDvsENGTest #INDvsENG #Ashwin #RavichandranAshwinpic.twitter.com/6nBjz57VCl
— Khabri_Prasang (@Prasang_) March 7, 2024