గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నేటి నుంచి ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో మ్యాచ్ (IND vs ENG 3rd Test) ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచినా ఇండియా బ్యాట్టింగ్ ఎంచుకుంది (India Won the Toss and decided to Bat first).
ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో ఇరు జెట్లు ఇప్పటికే చెరొక మ్యాచ్ గెలుచుకుని సిరీస్ 1-1 తో సమానం గా ఉన్నారు. అయితే ఇవాళ్టి నించి జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించి సిరీస్ ముందంజ లో ఉండాలి అని రెండు జట్లు ఆసేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఇండియా తరపున ఇద్దరు కొత్త బ్యాట్స్మెన్స్ లు సర్ఫరాజ్ (Sarfaraz) మరియు ధృవ్ జురెల్ (Jurel) టెస్టులలో ఆరంగేట్రం చేస్తున్నారు. ఒకపక్క గాయం కారణంగా శ్రేయాస్ సిరీస్ కు దూరం కాగా కే.ఎల్.రాహుల్ ఇంకా పూర్తిగా ఫిట్ కాకపోవడంతో ఈ మ్యాచ్ కి దూరంగా ఉండాల్సి వస్తోంది. వీరిద్దరి స్థానంలో సర్ఫరాజ్ మరియు ధృవ్ జురెల్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా రెండో మ్యాచ్ల్లో దూరంగా జడేజా, సిరాజ్ ఈ మ్యాచ్ లో తిరిగి జట్టులోకి వచ్చారు.
ఇకపోతే మరోపక్క ఇంగ్లాండ్ కేవలం ఒక్క మార్పు తో బరిలోకి దిగింది. రెండో మ్యాచ్ లో జట్టులో ఆరంగేట్రం చేసిన బషీర్ ఈ మ్యాచ్ కు తన స్థానం కోల్పోయాడు. అతడి స్థానంలో పేస్ బౌలర్ వుడ్ కు చోటు దక్కింది.
ఇండియా జట్టు:
రోహిత్, యశస్వి, గిల్, సర్ఫరాజ్, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా
ఇంగ్లాండ్ జట్టు:
బెన్ దక్కెట్, క్రాలి, పాప్, రూట్, స్టోక్స్, బైర్ స్టో, ఫోక్స్, రెహాన్, హార్ట్లే , ఆండర్సన్ , వుడ్
మూడో టెస్టులో బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ (IND VS ENG 3rd Test- India won the Toss):
India have won the toss and they've decided to bat first. pic.twitter.com/ZbXv7xvWZs
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 15, 2024
In – Sarfaraz, Jurel, Jadeja and Siraj.
Out – Iyer, Bharat, Axar and Mukesh. pic.twitter.com/SvNn6YUwro
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 15, 2024
ALSO READ: భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూత