Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే కాకుండా సోషల్ మీడియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం పై కేంద్ర ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదన్న విషయాన్ని గమనించాలి.
మోదీ సర్కారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసిన దగ్గర్నుంచి జోరుగా ఈ వదంతులు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి 2024 నాటికీ పది సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఈ విభజనలో ప్రక్రియలో భాగంగా… తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించిందని మనందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ గడువు 2024 నాటికి ముగియనున్న తరుణంలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) గా చేయడం వల్ల బీజేపీకి ఇక్కడ బలపడే అవకాశం ఉంటుందని కొంతమంది అంటుంటే… మరికొంత మంది హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ ను బలహీన పరిచేందుకు కేంద్రం వేసిన మాస్టర్ ప్లాన్ గా కొందరు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహోరాత్రులు కష్టపడి, పోరాటాలు చేసి, నిరసనలు తెలిపి, తమ ప్రాణాలు సైతం లెక్కచేకుండా దక్కించుకున్న ఈ రాష్ట్రాన్ని యూటిగా ప్రకటిస్తే ప్రజలు ఊరుకుంటారా… లేదా మరోసారి ఏకమవుతారా? మరి ఈ పోరాటాల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారు?
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన రాష్ట్ర సత్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్ర నిరన్యం తో ఏకీభవిస్తుందా… లేక కేంద్రానికే ఎదురు తిరుగుతుందా?
హైదరాబాద్ ను యూటి గా చేస్తే ఏమవుతుంది?
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ నగరం ప్రత్యేక పాత్ర పోషించింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ సేతం హైదరాబాద్ నుంచే వస్తుందన్న విషయం తెలిసినదే. మరిప్పుడు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రంలో కేవలం కేంద్ర విధించే పన్ను మాత్రమే ఉంటుంది. రాష్ట్ర పన్ను ఇక ఎక్కడ వర్తించదు.
దీంతో రాష్ట్ర ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడినట్లే. ఈ భారం ప్రభుత్వం అమలు చేసే పథకాలపై పడుతుంది. మరోపక్క రాష్ట్ర అభివృధికి అడ్డు పడినట్లే. ప్రస్తుతం ఉన్న అప్పులకన్నా రాష్ట్రం మర్రిని అప్పులు చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా రాష్ట్రానికి మరో రాజధాని నగరాన్ని నిర్మించాల్సి వస్తుంది… మరీ రాజధానిని కేంద్ర నిర్మిస్తుందా లేక రాష్ట్రమే నిర్ముచుకోవాలా? రాష్ట్రంలో కొత్తగా ఐ.టి వ్యవస్థను ప్రారంభించి స్థిరపరచాలి… ఈలోగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవచ్చు. ఉద్యోగ కల్పనకు సమయపడుతుంది దీంతో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది.
అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రకటిస్తే… ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీ వైపే ముగ్గు చూపుతారన్నది ఖాయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పార్టీల నేతలు మరియు ప్రజలు కేంద్ర నిర్ణయంపై ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.
ALSO READ: దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే