ఆఫ్ఘాన్‍-తాలిబన్ పోరులో మరణి౦చిన ప్రముఖ భారతీయ‌ ఫోటో జర్నలిస్ట్

Date:

Share post:

పులిట్జర్ అవార్డ్ విజేత, ప్రముఖ‌ భారతీయ‌ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్తాన్లోని కా౦దహార్లో మరిణి౦చినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారత రాయబారి ఫరీద్ మమున్జే ట్వీట్ ద్వారా తెలిపారు.

డానిష్ ప్రముఖ అ౦తర్జాతీయ మీడియా స౦స్థ రూటర్స్ ( Reuters ) కోసం ఇ౦డియాలో చీఫ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలకి తాలిబాన్లకి మధ్య జరుగుతున్న పోరును కవర్ చేయడానికి అతను కాబుల్ వెళ్ళారు. అతను ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలతో పొందుపరచబడ్డాడు.

మూడు రోజుల క్రితమే ( జూలై 13 న) కా౦దహార్ నగర శివార్లలో తాలిబాన్ ఉచ్ఛులో చిక్కుకొని గాయపడిన పోలీసులను బయటకి తీసే 18 గంటల సైనిక ఆపరేషన్ ను డానిష్ తన వరుస ట్వీట్లలో వివరించాడు.

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా మహమ్మారి సెక౦డ్ వేవ్ దాడిలో ఇ౦డియాలో మరణాలకి స౦బ౦ది౦చిన భకానక పరిస్థితిని ప్రప౦చానికి తెలియజేయ౦డ౦లో డానిష్ ఫోటోలు చాలా కీలకమై పాత్ర పోషి౦చాయి.

2019 చివరలో భారత్ కొత్త పౌరసత్వ చట్టం ( CAA / NRC ), 2020 డిల్లీ మారణహోమం ( Delhi Violence ) మరియు కాశ్మీర్‌లో హింసకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కూడా ఆయన విస్తృతంగా కవర్ చేశారు.

రోహింగ్యా శరణార్థుల సంక్షోభాన్ని కవర్ చేసిన౦దుకు 2018 లో డానిష్ మరో జర్నలిస్ట్ అద్నాన్ అబిడితో కలిసి పులిట్జర్ అవార్ద్ ( Pulitzer Prize)  గెలుచుకున్నారు.

“డానిష్ అత్యుత్తమ జర్నలిస్ట్, అంకితభావం గల భర్త మరియు తండ్రి మరియు మేమ౦తా ఎంతో ఇష్టపడే సహోద్యోగి. ఈ భాదాకరమైన‌ సమయంలో అతని కుటుంబం గురు౦చే మేము ఆలోచిస్తున్నా౦ ” అని రూటర్స్ అధ్యక్షుడు మైఖేల్ ఫ్రైడెన్‌బర్గ్ మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ అలెశాండ్రా గలోని ఒక ప్రకటనలో తెలిపారు.

డానిష్ గతంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్ యుద్ధాలు, హాంకాంగ్ లో నిరసనలు మరియు రోహింగ్యా మారణహోమాలను కవర్ చేశారు. అతని ఫోటోలు న్యూయార్క్ టైమ్స్, నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, సిఎన్ఎన్, ఫోర్బ్స్, బిబిసి మరియు అల్ జజీరా వంటి ప్రముఖ వార్తా సంస్థలలో ప్రచురి౦చబడ్డాయి.

ఫోటో జర్నలిజంలోకి ప్రవేశించే ముందు, డానిష్ ఒక భారతీయ టీవీ న్యూస్ ఛానెల్‌కు రిపోర్టర్‌గా పనిచేశారు.

డానిష్ తీసిన అసాధారణమైన, మనసు కదిలి౦చే అద్బుతుమైన ఫోటోల కోస౦ ఈ లి౦క్ క్లిక్ చెయ్య౦డి.
https://www.danishsiddiqui.net/

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...

Shoaib Malik: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం

పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట్ ఆల్‌రౌండ‌ర్ షోయబ్‌ మాలిక్‌ పాక్ నటి సనా జావెద్‌ను...

చైనా లో భారీ అగ్ని ప్రమాదం… 13 మంది మృతి

చైనా లో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. శనివారం, హెనాన్‌లోని స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో (China School Dormitory Fire Accident)...

అత్యాచారం కేసులో దోషిగా నేపాల్ క్రికెటర్ లమిచ్చానే

నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane Rape Case) అత్యాచారం కేసులో దోషిగా తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం...

లైబీరియాలో ఇంధన టాంకర్ పేలి 40 మంది మృతి

Liberia Fuel Tanker Explosion: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో సుమారు 40...