World Cup 2023 SA Vs SL: ఢిల్లీ లోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా మరియు శ్రీలంక (South Africa Vs Sri Lanka) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 102 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయాన్ని నమోదు చేసుకుంది.
సౌతాఫ్రికా : 428-5 / 50 ఓవర్లు (విజేత)
శ్రీలంక : 326-10 / 44.5 ఓవర్లు
మ్యాచ్ హైలైట్స్: (SA vs SL Highlights):
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది శ్రీలంక. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాట్టింగ్ కు దిగిన సౌతాఫ్రికా, శ్రీలంక బౌలర్ల పై విరుచుకుపడ్డారు. నిర్ణీత 50 ఓవర్లలో సఫారీలు 428 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేశారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ముగ్గురు బ్యాట్స్మెన్లు సెంచరీలు సాధించడమే కాకుండా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
429 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన శ్రీలంక ఓవర్లలో పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పరుగుల తేడాతో సౌతాఫ్రికా ప్రత్యర్థి శ్రీలంకను చిత్తుచేసింది.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్:
సెంచరీల మోత: (De Kock, Dussen & Markram centuries)
ముందుగా బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా… ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ బవుమా వికెట్ ను కోల్పోయింది. అయితే ఆ తరువాత వచ్చిన వన్ డేర్ డుసేన్, డి కాక్ తో కలిసి శ్రీలంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. వీరిద్దరూ తమదైన బ్యాట్టింగ్ సైలితో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు సెంచురీలు పూర్తిచేసుకోడమే కాకుండా రెండో వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
అయితే డి కాక్ సెంచరీ చేసిన అనంతరం అవుట్ కాగా… తర్వాత వచ్చిన మార్క్రామ్ కూడా బౌలర్ల పై ఏ మాత్రం కనికరం చూపించలేదు. మార్క్రామ్ తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం చేసిన డుసేన్ 108 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు.
డుసేన్ అవుట్ అయ్యేసరికి టీం స్కోర్ 264 ఉండగా ఇంకా 13 ఓవర్లు మిగిలి ఉన్నాయ్. దీంతో తరువాత క్రీజ్ లోకి వచ్చిన క్లాసేన్… మార్క్రామ్ చేస్తున్న విధ్వంసానికి ఆర్ధ్యం పోసాడు.
మార్క్రామ్ మోత: (Markram Mania)
ఈ క్రమంలో మార్క్రామ్ 49 బంతులతో సెంచరీని పూర్తిచేసి 106 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఆపై వచ్చిన జన్సెన్… క్లాసేన్ తో ఇన్నింగ్స్ కు కొసమెరుపులు అద్దారు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అయ్యేసరికి 428 పరుగులు చేయగలిగింది. వన్ డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ గా రికార్డు బుక్కులోకి ఎక్కింది. గతంలో 417 తో ఆస్ట్రేలియా పేరిట ఉండే ఈ రికార్డు ఇప్పుడు సౌతాఫ్రికా పేరిట మారింది.
శ్రీలంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు తీయగా… రజిత, పతిరానా, వేలలాగే కు ఒక్కో వికెట్ దక్కాయి.
శ్రీలంక ఇన్నింగ్స్:
మెండిస్ మెరుపులు:
429 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు రెండో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (0) స్కోర్ ఎం చేయకుండానే జన్సెన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తరువాత బాటింగ్ కు వచ్చిన కుసాల్ మెండిస్ సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేసాడు.
అయితే ఒక పక్క మెండిస్ దూకుడు గా ఆడుతుంటే కుసాల్ పెరెరా మాత్రం పెద్ద టచ్ లో కనిపించలేదు. వీరిద్దరు రెండో వికెట్ కు 66 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే మెండిస్ తన అర్ద శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. వీరి భాగస్వామ్యానికి జన్సెన్ బ్రేక్ వేసాడు. కుశాల్ పెరెరా (7) ను ఒక చక్కటి బంతితో క్లీన్ బౌల్డ్ చేసాడు.
తదుపరి బ్యాట్టింగ్ కు వచ్చిన సధీర కాసేపు మెండిస్ తో పోరాడాడు. కానీ మెండిస్ 76 పరుగుల వద్ద రాబాడ కు చిక్కాడు. ఆ వెంటనే సధీర (23) కూడా పెవిలియన్ కు క్యూ కట్టాడు. శ్రీలంక టాప్ ఆర్డర్ కూలిపోవడంతో జట్టు భారం మిడిల్ ఆర్డర్ పై పడింది.
అసలంక, షానాక పోరు:
111-4 వికెట్లు కోల్పోయిన శ్రీలంక మరో 40 పరుగులకి డి సిల్వా వికెట్ ను పోగొట్టుకుంది. అయితే అసలంక మాత్రం సౌతాఫ్రికా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. సిక్సలు ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు.
మరొక పక్క అసలంక కు తోడుగా షానాక బౌలర్లను నిలువరించాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 82 పరుగులు జోడించారు. అయితే అసలంక దూకుడుకు ఇంగిడి కళ్లెం వేసాడు. ఒక చక్కని స్లో బంతితో అసలంకను బోల్తా కొట్టించాడు. దీంతో 65 బంతుల్లో 79 పరుగులు చేసిన అసలంక విరోచితమైన ఇన్నింగ్స్ కు తెరపడింది.
అప్పుడే బ్యాటింగ్ కు వచ్చిన వెలలాగే మొదటి బంతికే నిష్క్రమించాడు. అసలంక వికెట్ తో షానాక బ్యాట్టింగ్ గేర్లు మార్చాడు. వరుస బౌండరీలతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం షానాక 68(62)ను మహారాజ్ బౌల్డ్ చేసాడు. దీంతో శ్రీలంక గెలుపు అసలు ఆవిరయ్యాయి.
సమయానుసారం ప్రత్యర్థి వికెట్లు తీసిన సౌతాఫ్రికా టెయిలెండర్ వికెట్ లు తీయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. చివరిలో రజిత బ్యాట్ ఝళిపించినప్పటికీ సౌతాఫ్రికా బౌలర్లు మ్యాచ్ ను త్వరగానే ముగించారు. దీంతో 44.5 ఓవర్లలో 326 పరుగులు చేసి శ్రీలంక ఆలౌట్ అయ్యింది. 102 పరుగుల తేడాతో సౌతాఫ్రికా శ్రీలంకను చిత్తుచేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జి (3), రబడా (2) మహారాజ్ (2), జాన్సెన్ (2), ఇంగిడి ఒక వికెట్ తీసుకున్నారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్:
ఐడెన్ మార్క్రామ్ – 106 పరుగులు (54 బంతుల్లో)
South Africa beats Sri Lanka by 102 Runs#SAvSL #ODIWorldCup2023 #ICCWorldCup2023 #SAvsSL pic.twitter.com/KmrWYgBleE
— RVCJ Media (@RVCJ_FB) October 7, 2023
పాయింట్ల పట్టిక (Points Table): World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?
ALSO READ: World Cup 2023: బంగ్లా బోణి… 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గెలుపు