చైనాలో అర్థరాత్రి భారీ భూకంపం సంభవిందించి. సోమవారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం (China Earthquake) లో ఇప్పటికే 100 మందికి పైగా చనిపోగా.. చాలా మంది గాయపడినట్లు సమాచారం.
వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో జనం ప్రాణభయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ ప్రమాదం వాళ్ళ ప్రజలు వందల సంఖ్యల్లో గాయపడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
చైనాలో భూకంపం (China Earthquake):
చైనాలో అర్థరాత్రి భారీ భూకంపం.. 111 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు.. రికార్ట్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.2గా నమోదు.. #china #Earthquake #LatestNews
— NTV Breaking News (@NTVJustIn) December 19, 2023
ALSO READ: కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం… అర్ధరాత్రి మాల్ లో మంటలు