మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని MLC కవిత గారిని, మాజీ మంత్రి నర్సాపూర్ MLA సునీతా గారిని కోరిన బీరయ్య యాదవ్ (Beeraiah Yadav Met K Kavitha and MLA Sunitha Lakshma Reddy).
2001 ఒకటి నుంచి తొలి ఉద్యమం తెలంగాణ తొలి ఉద్యమం నాటి నుంచి దాదాపు 24 సంవత్సరాలుగా ఏ పదవులు పొందలేదని… ఉద్యమ సమయంలో నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలాగే తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం ఉమ్మడి మెదక్ జిల్లా అంతటనే కాకా ఇతర జిల్లాల్లో అవిశ్రాంతగా పనిచేయడం జరిగింది. అనేక పోలీస్ కేసులు లాఠీ దెబ్బలు తిని చివరకు జైలుకు కూడా వెళ్లడం జరిగిందని బీరయ్య యాదవ్ అన్నారు.
ఈరోజు బీఆర్ ఎస్ ముఖ్య నాయకురాలు జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారిని హైదరాబాద్ లోని తన నివాసం లో కలిసి మహాత్మా పూలె విగ్రహాన్ని అసెంబ్లీ లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో చేస్తున్న పోరాటాన్ని పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలపడం జరిగింది.
అలాగే జనాభాలో సగం శాతంగా ఉన్న బీసీ కుల లెక్కలు తీయాలని చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేషన్ పోరాటం చేయాలని కూడా సలహా ఇవ్వడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించారు.
ప్రస్తుతం మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి గా పార్లమెంట్ అభ్యర్థిత్వానికి నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా MLC కవిత గారిని కోరడం జరిగింది. వారు సాను కూలంగా మద్దతు ఇస్తామని అన్నారు. అదే విదంగా హైదరాబాద్ లోని తన నివాసం లో మాజీ మంత్రి నర్సాపూర్ MLA సునీతా లక్షారెడ్డి గారిని కలిసి పుష్ప గుచం ఇచ్చి వినతి పత్రాలు అందజేసి ఆశీర్వాదం తీసుకొని మద్దత్తు కోరడం జరిగింది.
వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ, మీకు అండగా ఉంటామని అన్నారు. ఎమ్మెల్సీ కవిత గారికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి గారికి బీరయ్య యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ALSO READ: బీరయ్య యాదవ్ కు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలి