AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మరియు బాంగ్లాదేశ్ (Afghanistan vs Bangladesh) మధ్య జరిగిన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయ కేతనం ఎగరవేసింది. ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమి-ఫైనల్స్ కు (Afghansitan enters Semi Finals) చేరుకోగా… బాంగ్లాదేశ్ మరియు ఆస్ట్రేలియా (Bangladesh and Australia Knocked Out) గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి.
ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాట్టింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో గుర్బాజ్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా … మిగిలిన వారెవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
బంగ్లా బౌలర్లలో రిషద్ 3 వికెట్లు తీసుకోగా …. ముస్తాఫిజుర్ మరియు తస్కిన్ చెరొక వికెట్ దక్కించుకుని ఆఫ్ఘన్ ను తక్కువ స్కోరుకే కట్టడి చెయ్యడంలో సఫలం అయ్యారనే చెప్పుకోవాలి.
కేవలం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ 105 పరుగులకే కట్టడిచేసి విజయాన్ని (DLS Method) సొంతం చేసుకుంది. ఒకపక్క వికెట్లు కోల్పోతున్నా బాంగ్లాదేశ్ జట్టును గెలిపించడానికి ఓపెనర్ లిటన్ దాస్ విశ్వప్రయత్నం చేసాడు. అయితే మిగిలిన బ్యాటర్లు ఎవరు తనకి సహకరించకపోవడంతో బాంగ్లాదేశ్ ఓటమి చవిచూడక తప్పలేదు.
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సూపర్ 8 మ్యాచ్ లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమిస్ లో చోటు సంపాదించుకుంది. అయితే ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి భారత్ నాక్ అవుట్ కు చేరిన విషయం తెలిసిందే.
దీనితో సెమి-ఫైనల్స్ లో ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా అలాగే భారత్ మరియు ఇంగ్లాండ్ తలపడనున్నాయి.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్: నవీన్ ఉల్ హక్
సెమిస్ కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan Enters Semi Finals):
𝐖𝐇𝐀𝐓 𝐀 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐅𝐎𝐑 🇦🇫
Afghanistan are through to the #T20WorldCup 2024 semi-final 👏 pic.twitter.com/wugQg90R0I
— ICC (@ICC) June 25, 2024