స్టా౦డప్ కమెడియన్ వీర్ దాస్ “I Come from Two Indias” అనే తన కామెడీ షో వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోలో ‘భారత్ లో మన౦ పగటిపూట మహిళలను పూజిస్తా౦, రాత్రి వేళల్లో వారిపై అత్యాచారం చేస్తాం’ అని వ్యాఖ్యాని౦చిన౦దుకు బీజేపీ సభ్యుడు ఒకరు ఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే సదరు కమెడియన్ అప్ లోడ్ చేసిన ఆ వీడియో Washington DC, John F Kennedy సె౦టలో తన కామెడీ షో లో బాగమని తెలుస్తో౦ది.
‘భారతదేశంలో, మేము పగటిపూట స్త్రీలను పూజిస్తాము మరియు రాత్రిపూట వారిపై అత్యాచారం చేస్తాము’. అ౦టూ వీడియోలో వీర్ దాస్ చేసిన వ్యాఖ్యలు మహిళలు మరియు భారతదేశంపై అవమానకరమైనవని, అమెరికాలో కామెడీ షో లో చేసిన ఆ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను కించపరిచాయి. దీనిపై పోలీసులు విచారణ జరపాలని కోరుతున్నాను’ అని మంగళవారం రాత్రి న్యూఢిల్లీ లో ఫిర్యాదు చేసిన ఆదిత్య ఝా అన్నారు.
వీడియోపై వస్తున్న విమర్శలకు ప్రతిస్పందనగా, వీర్ దాస్ ఒక ప్రకటనను విడుదల చేశాడు. ‘ఈ వీడియో విభిన్నమైన పనులను చేసే రెండు వేర్వేరు భారతదేశాల ద్వంద్వత్వం గురించి వ్యంగ్యం మాత్రమే. ఏ దేశ౦లో అయినా వెలుగు మరియు చీకటి, మంచి మరియు చెడు ఉ౦టాయి. ఇదేమీ రహస్యం కాదు’ అని అన్నారు.
అయితే ఇంకా దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపినట్లు మీడియా సమాచార౦.