Munawar Faruqui Receiving Threat Calls: తనను పని చేసుకోనివ్వడ౦ లేదని మరియు తనకు ప్రతిరోజూ అనేక బెదిరింపు కాల్‌లు వస్తున్నాయని ప్రముఖ స్టా౦డప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ వాపోయినట్లు NDTV ఒక న్యూస్ రిపోర్టులో తెలిపి౦ది.
బజరంగ్ దళ్ ను౦చి వస్తున్న బెదిరింపుల కారణంగా ఇటీవల ముంబైలో జరగవలసిన ఫరూఖీ యొక్క మూడు షోలు రద్దయినట్లు తెలుస్తో౦ది.
“నాకు రోజూ 50 బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నేను నా సిమ్ కార్డ్‌ని మూడుసార్లు మార్చవలసి వచ్చింది. నా నంబర్ లీక్ అయినప్పుడు, చాలామ౦ది కాల్ చేసి నన్ను దుర్భాషలాడారు” అని అతను చెప్పాడు.
ఈ సంవత్సరం ఆరంభంలో, ఫరూకీ “హిందూ దేవుళ్ళను మరియు దేవతలను అవమానించాడని” ఆరోపించిన కేసులో ఒక నెలపాటు జైలులో ఉన్నాడు, తరువాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వేదికలను తగలబెడతామని బజరంగ్ దళ్ సభ్యులు బెదిరించడంతో అతని ముంబై షోలు రద్దు చేయబడ్డాయి. దేశంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, నా షోలు రద్దు చేయడం దురదృష్టకరమని అన్నారు.
మునావర్ ఫరూఖీ NDTV తో మాట్లాడుతూ “పెద్ద సమస్య ఏమిటంటే, ఈ మూడు షోల కోసం, ఒక నెల క్రితం మొత్తం 1,500 మంది టిక్కెట్లు కొనుగోలు చేసారు. వారికోస౦ నేను చి౦తిస్తున్నాను. ఇది ఈ దేశంలో చాలా మంది ప్రజలు జీవిస్తున్న విచారకరమైన వాస్తవం” అని చెప్పారు.
మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఫరూఖీ అన్నారు.