MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. CSK టీం మానేజ్మెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం… MS Dhoni (మహేంద్ర సింగ్ ధోనీ)కు క్యాల్ఫ్ స్ట్రెయిన్ (Injury) కారణంగా తొలి రెండు వారాల పాటు మ్యాచ్లకు దూరంగా కానున్నాడు.
ధోనీకి ఏమైంది? (MS Dhoni Injury Details)
CSK అందించిన సమాచారం ప్రకారం… ధోనీకి క్యాల్ఫ్ స్ట్రెయిన్ (Calf Strain) కావడంతో ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు రికవరీకి కనీసం రెండు వారాలు అవసరం అవుతుందని సమాచారం. అందువల్ల IPL 2026 లో పలు మ్యాచ్లను మిస్ అయ్యే అవకాశం ఉండనుంది.
CSK కి షాక్
ధోని అందుబాటులో లేకపోవడం Chennai Super Kings (CSK)కి ఇది పెద్ద నష్టం అనే చెప్పాలి. ఇది కేవలం టీం మానేజ్మెంట్ కే కాదు అభిమానులను కూడా కలవరపెట్టే విషయం. ఎందుకంటే ధోనీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు—జట్టుకి మంచి నాయకుడిగా, ఫినిషింగ్ మాస్టర్, బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లెర్ గా, స్ట్రాటజీ ప్లానర్ గా మంచి పేరుంది.
అయితే CSK కెప్టెన్గా Ruturaj Gaikwad ఉన్నా. ధోనీ లేకపోవడంతో అతనిపై మరింత బాధ్యత పడనుంది. అలాగే వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా మరో ప్లేయర్ చేపట్టే అవకాశం ఉంది.
ఇది యువ ఆటగాళ్లకు ఒక గోల్డెన్ ఛాన్స్ కూడా అనే చెప్పాలి. ఎవరు ముందుకు వస్తారు? ఎవరు “న్యూ హీరో” అవుతారు? అన్నది చూడాలి.
ముగింపు (Conclusion):
IPL 2026 ప్రారంభానికి ముందు ఈ వార్త రావడం CSK ఫాన్స్ కు షాక్ ఏ అయినా, ధోనీ తిరిగి వచ్చిన రోజు… స్టేడియం లో జోష్ మరింత రెట్టింపు అవుతుంది అనే చెప్పాలి. ప్రస్తుత సమాచారం ప్రకారం ధోనీ మిడ్-ఏప్రిల్లో తిరిగి వచ్చే అవకాశం ఉంది.
రెండు వారాలు అవుట్ (MS Dhoni Calf Strain Injury)
Official Statement
MS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.
Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi
— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026
🚨 MS DHONI RULED OUT OF FIRST TWO WEEKS. 🚨
– MS Dhoni is currently undergoing rehabilitation for calf strain which rules him out for first 15 days of IPL 2026. pic.twitter.com/w9aFdoAoXa
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2026
ALSO READ: World Happiness Report: 116వ ర్యాంకులో భారత్




