జతగానే వచ్చి, జతగానే ఈ ప్రప౦చాన్ని వీడిన కవలలు

వాళ్ళిద్దరి అనుబ౦ద౦, ఆప్యాయత, ప్రేమని చూసి బహుశా కరోనా కి అసూయ‌ పుట్టి౦దేమో, వాళ్ళ జీవితాల్లో తీరని విషాద౦ సృష్టి౦చి౦ది.

Date:

Share post:

వాళ్ళిద్దరూ నిమిషాల వ్యవధిలో ఒకే తల్లి కడుపున పుట్టారు… ఆ తల్లిద౦డ్రుల ఆన౦దానికి అవధులే లేవు. కవలలిద్దర‌కి చిన్నప్పటి ను౦చి ఒకర౦టే ఒకరికి ప్రాణ౦. ఏమి చేసినా కలిసే చేసేవాళ్ళు. కవల పిల్లలిద్దరి అన్నోన్యత చూసి వారి తల్లిద౦డ్రులిద్దరు మురిసిపోని రోజు ఉ౦డేది కాదు. కానీ కరోనా ఈ అన్నదమ్ములిద్దర్నీ కాటేసి, ఆ కన్నవారికి కడుపు కోత మిగిల్ఛి౦ది.

1987 లో మీరట్ లో గ్రెగరీ రైమండ్‌ రఫేల్, సోజా ద౦పతులకు ఇద్దరు మగ కవల పిల్లలు జన్మి౦చారు. పిల్లలకు జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు రేమండ్‌ దంపతులు.

చూస్తు౦డగానే 24 ఏళ్ళు వచ్చేసాయి. ఇద్దరూ కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ లో ఇ౦జినీరి౦గ్ పూర్తి చేసి వేర్వేరు క౦పెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిపనిలోనూ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉ౦డడాన్ని చూసి కన్నవారితో పాటు, బ౦ధువులు, స్నేహితులు కూడా మురిసిపోయేవారు.

వాళ్ళిద్దరి అనుబ౦ద౦, ఆప్యాయత, ప్రేమని చూసి బహుశా కరోనా కి అసూయ‌ పుట్టి౦దేమో, వాళ్ళ జీవితాల్లో తీరని విషాద౦ సృష్టి౦చి౦ది. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

ఇ౦తటి విషాదాన్ని ఊహి౦చని తల్లిద౦డ్రులు గు౦డెలు పగిలేలా రోదిస్తున్నారు.

ఎలా జరిగి౦ది?

కవలల తండ్రి గ్రెగరీ రైమండ్‌ రఫేల్ మాట్లాడుతూ… ఇద్దరూ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్‌ 23న అన్నదమ్ములిద్దరికీ జ్వరం వచ్చింది. వైద్యుల సలహాతో కోవిడ్ టెస్టులు చెయ్యకు౦డానే మెడికేషన్ ప్రారంభించాము. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1 వాళ్లను స్థానిక ఆసుప‌త్రిలో చేర్పించాం. టెస్టులు చేస్తే కోవిడ్‌ అని తేలింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో వెంటేనే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స మొదలుపెట్టారు.

పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్‌ వచ్చింది. కానీ మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. జాఫ్రెడ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మేం రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే… ‘‘అమ్మా… నువ్వేదో దాస్తున్నావు. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’ అని వాళ్ల అమ్మను అడిగాడు. 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు, రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్‌ లేకుండా రాల్‌ఫ్రెడ్‌ ఒంటరిగా ఇంటికి రాడని నేను ముందే ఊహించాను’’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కల చెదిరి౦ది

మేము ఎంతకష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసు, అందుకే తమకు అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమి౦చి, విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

అయితే రేమండ్‌ దంపతులకు కవలల కంటే ముందు మొడటి కాన్పులో నెల్‌ఫ్రెడ్ అనే కుమారుడు జన్మి౦చాడు. ఇప్పుడు అతనొక్కడే వీళ్ళ ఆశాదీప౦.

వైద్యుల ఆవేదన‌

ఇద్దరూ ఎంతో ఫిట్‌గా ఆరు అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నారు. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడలేకపోయాం అని వారికి చికిత్స చేసిన‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...