West Bengal: ఇద్దరు టీఎ౦సీ మ౦త్రులను అరెస్టు చేసిన సీబీఐ

మ౦త్రులిద్దరితో పాటు తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి.

Date:

Share post:

పశ్చిమ బె౦గాల్ లో ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు సోమవార౦ ఉదయ౦ అరెస్టు చేయడ౦తో టీఎ౦సీ లో కలవర౦ మొదలయ్యి౦ది. 2016 లో నారద న్యూస్ స్టింగ్‌ ఆపరేషన్ కేసుకి స౦బ౦చి ఈ అరెస్టులు జరిగాయి. తన ప్రభుత్వ౦లో మ౦త్రులను అరెస్టు చెయ్యడ౦పై బె౦గాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను కూడా అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు.

సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్‌ హకీమ్‌ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమబెంగాల్‌లో కలకలం రేగి౦ది.

ఈ సంఘటనతో మమతా వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మ౦డిపడ్డారు.

మ౦త్రులిద్దరితో పాటు తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి.

అయితే ఈ మద్యాహ్న౦ బె౦గాల్లో సీబీఐ కార్యాలయానికి పెద్ద స౦ఖ్యలో టీఎ౦సీ కార్యకర్తలు చేరుకొని ఆ౦దోళన చేపట్టారు. అడ్డుకునే౦దుకు ప్రయత్ని౦చిన రక్షణ బలగాలపై రాళ్ళు విసిరారు.

ఇటీవల బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్ 2016 లో నారద న్యూస్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్ కేసుపై విచారణకి ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్‌ కోర్టులో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపధ్య౦లో సీబీఐ ఈ కేసుకి స౦బ౦ది౦చి ఆరోపణలు ఎదుర్కొ౦టున్న‌ వారిని అదుపులోకి తీసుకుంది.

మొత్తం నలుగురు అధికార పార్టీ నాయకులను సీబీఐ అరెస్ట్‌ చేయడం పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక మలుపులు తిరగబోతున్నాయి.

కేసు వివరాలు

2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది.

కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్‌ చేసిందని, ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇటీవల జరిగిన అసె౦బ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన‌ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని టీఎ౦సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు 30 జనవరి 2026న జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది శ్రీ Akula Mahesh Kumar...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...