IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో 78 పరుగుల తేడాతో చెన్నై విజయకేతనం (CSK beat SRH by 78 runs) ఎగరవేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాట్టింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ 98 పరుగులు, మిట్చెల్ 52 పరుగులు, దూబే 39 పరుగులతో జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 41 పరుగులకే మూడు వికెట్ లు కోల్పోయి కష్టాలలో పడింది. ఇకపోతే తదుపరి బ్యాట్టింగ్ దిగిన బ్యాటర్లు కూడా జట్టును ఆదుకునే ప్రయత్నం చేయడంలో విఫలం అయ్యారు. దీంతో సన్ రైజర్స్ 18.4 ఓవెన్లలోనే 134 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో క్లాసీన్ 20 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశపాండే నాలుగు వికెట్ లు తీసుకోగా… ముస్తాఫిజుర్, పతిరానా చెరో రెండు వికెట్లు, జడేజా మరియు ఠాకూర్ చెరొక వికెట్ దక్కించుకుని ప్రత్యర్థి సన్ రైజర్స్ కు కట్టడి చేయడంలో సఫలం అయ్యారు.
ఈ మ్యాచ్ లో విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో తొమిది మ్యాచులలో ఐదు విజయాలతో మూడో స్థానంలో ఉండగా… సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ విజయం (CSK beat SRH by 78 Runs):
150TH WIN IN IPL HISTORY FOR MS DHONI. 🐐 pic.twitter.com/sIUKdjdLdh
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2024
ALSO READ: IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం