Prakash Raj Summoned in Ponzi Scam: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 100 కోట్ల విలువైన పోంజీ స్కీమ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు సమాచారం.
తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రసిద్ధ ప్రణవ్ జ్యువెలర్స్‌లో పీఎంఎల్ఏ (PMLA) ఆధ్వర్యంలో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో వంద కోట్లకు పైగా మోసం జరిగిందని తెలుస్తోంది. అయితే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ ప్రణబ్ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్‌ను విచారించడానికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్ (Prakash Raj Summoned in Ponzi Scam):
ED summons Prakash Raj in ₹100 crore ponzi scam.#TNShorts #PrakashRaj pic.twitter.com/IdFdGZtvHA
— TIMES NOW (@TimesNow) November 24, 2023
ALSO READ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత