World Cup 2023 IND vs AUS: వన్ డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా చెన్నై వేదికగా నిన్న జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా (India vs Australia)మ్యాచ్ లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాని ఓడించింది.
ఆస్ట్రేలియా : 199-10 / 49.3 ఓవర్లు
ఇండియా : 201-4 / 41.2 ఓవర్లు (విజేత)
మ్యాచ్ హైలైట్స్: (IND vs AUS Highlights):
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో కేవలో 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ లో ఇండియా శుభారంభం చేసింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్:
తొలుత టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మార్ష్ మరియు వార్నర్ లతో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ మార్ష్ ను పెవిలియన్ కు పంపాడు బుమ్రా. తరువాత బాటింగ్ వచ్చిన స్మిత్ తో ఇన్నింగ్స్ కు చక్కదిద్దారు వార్నర్. వీరిద్దరూ రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు.
అయితే తర్వాత బ్యాట్టింగ్ కు వచ్చిన ప్లేయర్లు ఎవరు పెద్దగా చెప్పుకోదగ్గ బ్యాట్టింగ్ చేయలేదు. జడేజా, కుల్దీప్ మరియు అశ్విన్ తమ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ కు చుట్టేశారనే చెప్పాలి.
ఆస్ట్రేలియా బాటింగ్ లో స్మిత్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా వార్నర్ 41 పరుగులతో తరువాత స్థానంలో ఉన్నాడు. భారత్ బౌలర్లలో జడేజా కు (3), కుల్దీప్ కు (2), బుమ్రా కు (2) వికెట్లు దక్కగా… సిరాజ్, హార్దిక్, అశ్విన్ చెరొక వికెట్ తీసుకున్నారు.
ఇండియా ఇన్నింగ్స్:
అనంతరం 200 పరుగుల స్వల్ప లక్ష్యం తో బ్యాట్టింగ్ కు దిగ్గింది ఇండియా. అయితే లక్ష్య ఛేదనలో ఇండియాకు ఆరంభంలోనే గట్టి ఝలక్ ఇచ్చారు ఆసీస్. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మరియు శ్రేయాస్ ఇయర్ పరుగుల కాత తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
దీంతో ఇన్నింగ్స్ ను చక్కదిదే భాధ్యతను చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరియు కే ఎల్ రాహుల్ వారి భుజాన వేసుకున్నారు. అయితే కోహ్లీ 12 పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నించి తప్పించుకున్నాడు. హాజల్ వుడ్ వేసిన బౌన్సర్ ను అదే క్రమంలో కోహ్లీ బంతిని గాల్లోకి లేపాడు అయితే మార్ష్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను జారవిడిచారు. దీంతో ఇండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అవకాశాన్ని కోహ్లీ అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. వికెట్ కీపర్ కే ఎల్ రాహుల్ తో కలిసి కోహ్లీ నిలకడగా ఆడుతూ విజయానికి చేరుకునేలా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వీరిద్దరు అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. అంతే కాదు ఆసీస్ స్పిన్నర్లను సామర్ధ్వాంతంగా ఎదురుకోగలిగారు.
అయితే ఇన్నింగ్స్ ను ముగించే క్రమంలో కోహ్లీ 85 పరుగుల వద్ద బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కోహ్లీ వికెట్ తో క్రీజ్ లోకి వచ్చిన పాండ్య… రాహుల్ తో కలిసి గేర్లు మార్చారు. అప్పటికి 91 పరుగులతో బ్యాట్టింగ్ చేస్తున్నాడు రాహుల్. కానీ టీం విజయానికి కావాల్సింది 5 పరుగులే. రాహుల్ సెంచరీ సాధించాలంటే ఒక ఫోర్, ఒక సిక్స్ కావాలి. కానీ ఈ ప్రయత్నాల్లో కవర్ మీదుగా రాహుల్ కొట్టిన షాట్ నేరుగా సిక్సర్ వెళ్ళింది. దీంతో రాహుల్ సెంచరీ కలకు తెరపడింది.. కానీ ఇండియా 6 వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచింది.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్:
కే ఎల్ రాహుల్- 97* పరుగులు (113 బంతుల్లో)
India Vs Australia ODI:
India have started the tournament in style. KL Rahul and Virat Kohli were outstanding and despite 3 batsman failing winning so comfortably is ominous sign. Onwards and Upwards#INDvsAUS #CricketWorldCup2023 pic.twitter.com/J70CniCD0u
— Venkatesh Prasad (@venkateshprasad) October 8, 2023
KL's recipe for success at 5: First, respect good balls; build partnerships; pick the right bowler to attack, and finally, play the shot most suited for the occasion. KL, the finisher. @klrahul #KLRahul #IndVsAus pic.twitter.com/JWcDiWPzyT
— Mohammad Kaif (@MohammadKaif) October 8, 2023
ALSO READ: CWC 2023: కోట్లాలో సౌతాఫ్రికా ఊచకోత… శ్రీలంక పై ఘన విజయం