World Cup 2023: బంగ్లా బోణి… 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గెలుపు

Date:

Share post:

ICC Cricket World Cup 2023: ఐసీసీ వన్ డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ బాంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ (Bangladesh vs Afghanistan) తలపడ్డాయి. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ శనివారం ఉదయం 10:30 నించి ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లో బాంగ్లాదేశ్  6 వికెట్ల తేడాతో అఫ్ఘానిస్తాను ఓడించింది.

ఆఫ్ఘనిస్తాన్ : 156-10 / 37.2 ఓవర్లు
బాంగ్లాదేశ్ : 158-4 / 34.4 ఓవర్లు (విజేత)

హైలైట్స్: (BAN vs AFG Highlights)

ఈ మ్యాచ్ లో తొలుత బాంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాట్టింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ బాంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 37.2 ఓవర్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం 157 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బాంగ్లాదేశ్ 34.4 ఓవర్లలోనే 158 పరుగులు పూర్తిచేసింది. దీంతో 6 మరో వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై బాంగ్లాదేశ్ విజయం దక్కించుకుంది.

ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్:

టాస్ ఓడిన ఆఫ్ఘనిస్తాన్… ఓపెనర్లు గుర్బాజ్ మరియు ఇబ్రహీం జద్రాన్ తో బ్యాట్టింగ్ కు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కొంచెం నిలకడగానే ఆడిన ఆఫ్గనిస్తాన్… ఓపెనర్లు గుర్బాజ్ (47), జద్రాన్ (22) వికెట్లు కోల్పోయాక మళ్ళి కోలుకోలేదు.

రహ్మత్ 18 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లో లిట్టన్ దాస్ కి చిక్కితే… షాహిదీ కూడా 18 పరుగులు వద్ద మెహిది బౌలింగ్ లో ఔటయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను తక్కువ స్కోర్లకే కోల్పోవడంతో ఆఫ్ఘనిస్తాన్ టీం ఒత్తిడికి గురయింది. తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన అలిరౌండర్లు కూడా స్కోర్ బోర్డు ముందుకి నడిపించే ప్రయత్నం చేయలేకపోయారు. ఇకపోతే టెయిలెండర్ కూడా బ్యాట్టింగ్ లో చేతులెత్తేశారు.

బంగ్లా బౌలర్లు తిప్పేశారు:

బాంగ్లాదేశ్ స్పిన్ బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్తాన్ కుదేలైయ్యింది. వచ్చిన బాట్స్మెన్ వచ్చినట్టే పెవిలియన్ కు క్యూ కట్టారు. బాంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్, మెహిది హాసన్ చెరో మూడు వికెట్లు తీయగా… ఇస్లాం కు రెండు అలాగే తస్మిన్, ముస్తాఫిజుర్ కు ఒక్కో వికెట్ దక్కింది.

బాంగ్లాదేశ్ ఇన్నింగ్స్:

ప్రత్యధిని 156 కే ఆలౌట్ చేసిన బాంగ్లాదేశ్… 157 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ మొదలుపెట్టింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బాంగ్లాదేశ్, తమ ఓపెనర్లు టాంజిద్ హాసన్ (5),లిటన్ దాస్ (13) వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న మెహెడీ హాసన్:

అయితే వన్ డౌన్ లో బ్యాట్టింగ్ కు వచ్చిన మెహిది హాసన్, నజముల్ శాంటో తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే మెహిది అర్ధ శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అంతే కాదు వీరిద్దరు కలిసి జట్టుకి 97 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం మెహిది 57 పరుగుల వద్ద నవీన్ ఉల్ హాక్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

అయితే అప్పటికే బాంగ్లాదేశ్ విజయం ఖరారు అయిపోవడంతో తర్వాత బ్యాట్టింగ్ కు వచ్చిన షకీబ్, శాంటోతో కలిసి మరో పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు విఫలం:

బాంగ్లాదేశ్ ముందుంచిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ విఫలం అయ్యిందనే చెప్పాలి. ఇన్నింగ్స్ మొదట్లో రెండు వికెట్ల వెంట వెంటనే తీసిన బాంగ్లా ఆటగాళ్లపై అదే ఏయ్ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఫారూఖీ మరియు నవీన్ ఉల్ హాక్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ ముఖ్య బౌలర్ ఆయన రషీద్ కు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం జట్టుని కలవరపరిచే విష్యం అనే చెప్పాలి.

మ్యాన్ అఫ్ ది మ్యాచ్:

మెహిది హాసన్ మిరాజ్– 57 పరుగులు(73 బంతుల్లో) మరియు 3 వికెట్లు.

ట్వీట్:

ALSO READ: World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...