CM Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. తెలంగాణలోని సర్కారు బడులలో చదువుతున్న విద్యార్థుల కోసం (సీఎం అల్పాహార పథకం) ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందించడంతో పాటు… వారంతా చదువు పై దృష్టి సారించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని తీసుకొచ్చారు.
ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ గారు ఈ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించి… విద్యార్థులకు తానే స్వయంగా వడ్డించి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ తిన్నారు మంత్రి కేటీఆర్.
సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం మెనూ: (CM Breakfast Scheme Menu)
సోమవారం: ఇడ్లీ, సాంబర్ లేదా గోధుమ రవ్వ ఉప్మా
మంగళవారం: పూరి, ఆలూ కూర్మ లేదా టమాట బాత్
బుధవారం: ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, చట్నీ
గురువారం: మిల్లెట్స్, ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం: ఉగ్గాని లేదా పోహా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ, కిచిడీ
శనివారం: పొంగల్ సాంబార్ లేదా వెజిటేబుల్ పలావ్.
Minister for IT, Industries, MA & UD, Telangana tweet:
The Telangana government has introduced a new humanitarian initiative – the CM's Breakfast Scheme.
This scheme, envisioned by Chief Minister KCR, aims to provide high-quality and nutritious breakfast to students attending government schools across the State.
Minister @KTRBRS… pic.twitter.com/ZIRyUzG5Uc
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 6, 2023
ALSO READ: విశాఖపట్నంలో పరుగులు తీయనున్న మెట్రో రైలు… శంకుస్థాపన ఖరారు