Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్ 3వ తేదీన పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి సంబంధిత రాజకీయ పార్టీలతో అలాగే అధికారులతో చర్చినున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలియజేసారు.
మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న ఈసి బృందం… అక్టోబర్ 3 న జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశమై, అభిప్రాయ సేకరణ చేయనుంది.అదే రోజున ఎక్సైజ్ ఆదాయపన్ను, రవాణా శాఖల అధికారులతో మరియు బ్యాంకువాళ్లతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు సమావేశం కానుంది. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు, ఇతర కానుకల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలపై భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రెండవ రోజున అనగా అక్టోబర్ 4 న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీ మరియు పోలీస్ కమిషనర్లతో సమావేశం కానుంది.
చివరి రోజు అనగా అక్టోబర్ 5న ఎన్నికల ఏర్పాటుపై సమీక్షించి… ఓటర్లకు ఎన్నికల అవగాహన కార్యక్రమంపై దృష్టిసారించనున్నారు. అంతేకాకుండా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానున్నట్లు మీడియా సమాచారం.
మూడు రోజుల పర్యటన అనంతరం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకుగాను… తెలంగాణ మినహా నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే పర్యటించిన సంగతి తెలిసినదే.
ALSO READ: ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం