Chandrababu Khaidi No 7691: తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజముండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691 ను కేటాయించిన అధికారులు. జైల్లో స్నేహ బ్లాక్ లో చంద్రబాబును ఉంచినట్లుగా సమాచారం.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మోసం కేసులో చంద్రబాబును శనివారం తెల్లవారుజామున సీఐడీ అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం ఆయనను విచారణకు విజయవాడకు తరలించారు.
కేసు విచారణలో సీఐడీ వాదనలను ఏకీభవించిన విజయవాడ ఏసీబీ కోర్ట్ చంద్రబాబు కి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అనగా ఈ నెల 22 వరుకు జ్యుడీషియల్ రిమాండును విధించింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉంతర్వులతో ఆదివారం రాత్రి 9.30కు చంద్రబాబు ను విజయవాడ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి తరలించారు.
ఇదిలా ఉండగా రాజమండ్రి జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు ఏసీబీ కోర్టును కోరారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలి ఆయన తెలిపారు. దీంతో కోర్టు చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బండికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నిరసనకు జెనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా నిచినట్లు సమాచారం.
రాష్ట్రంలో 144 సెక్షన్:
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతే కాకుండా ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
మినిస్టర్ రోజా ట్వీట్:
40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు చాలా తెలివిగా ప్రజాధనాన్ని లూటీ చేశాడు. లీగల్‌గా దొరకకూడదనే ఉద్దేశంతో కోడ్ భాషలు వాడి మరీ ప్రజల్ని @ncbn మోసం చేశాడు. ఎట్టకేలకి న్యాయదేవత ముందు అతడ్ని అధికారులు నిలబెట్టగలిగారు, అని రోజా సెల్వమణి ట్వీట్ చేశారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు చాలా తెలివిగా ప్రజాధనాన్ని లూటీ చేశాడు. లీగల్‌గా దొరకకూడదనే ఉద్దేశంతో కోడ్ భాషలు వాడి మరీ ప్రజల్ని @ncbn మోసం చేశాడు. ఎట్టకేలకి న్యాయదేవత ముందు అతడ్ని అధికారులు నిలబెట్టగలిగారు.#KhaidiNo7691#SkilledCriminalCBNInJail pic.twitter.com/AdHkZ8ANlO
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 11, 2023
ALSO READ: నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు