ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ ట్వీట్ చేస్తూ ఆ౦దోళన వ్యక్త౦ చేసారు.
“అమ్మాయిలు తమ హిజాబ్లతో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయంకరమైనది” అని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. “మహిళల పట్ల అభ్యంతరం కొనసాగుతుంది – తక్కువ లేదా ఎక్కువ ధరించినందుకు. భారత నాయకులు ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాలి.
కర్ణాటక రాష్ట్రంలోని కళాశాలల్లో ఇటీవలి హిజాబ్ నిషేధంపై నిరసనలు ఉధృతమవుతున్న నేపధ్య౦లో, రాళ్ల దాడి మరియు లాఠీచార్జి సంఘటనలు అనేక జిల్లాలలో చోటుచేసుకున్న దానిపై స్ప౦దిస్తూ ఆమె ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తో౦ది.
“College is forcing us to choose between studies and the hijab”.
Refusing to let girls go to school in their hijabs is horrifying. Objectification of women persists — for wearing less or more. Indian leaders must stop the marginalisation of Muslim women. https://t.co/UGfuLWAR8I
— Malala (@Malala) February 8, 2022
“శాంతి మరియు సామరస్యాన్ని” కాపాడేందుకు మూడు రోజుల పాటు హైస్కూల్స్ మరియు కాలేజీలను మూసివేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు.
కర్నాటకలోని ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ కళాశాల తరగతి గదిలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. నిషేధాన్ని ప్రతిఘటించిన ఏడుగురు విద్యార్థులకు ప్రవేశం నిరాకరించబడింది. అప్పటి నుండి, నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి.
ఇదిలావుండగా, ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర విద్యాసంస్థల నిర్ణయాలను ధృవీకరించే ఆదేశంలో, కర్ణాటక ప్రభుత్వం గత వారం “సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే దుస్తులను ధరించరాదని” పేర్కొంది.