ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో గత కొంతకాలంగా టవర్ చుట్టూ వివాదం నెలకొన్న విషయ౦ తెలిసి౦దే.
ది ఇ౦డియన్ ఎక్శ్ప్రెస్ నివేదిక ప్రకార౦… నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను జనవరి 26న అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరిగింది.
మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ… వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు టవర్‌ను త్రివర్ణ పతాకంతో అలంకరించాలని, టవర్‌కు సమీపంలో జాతీయ జెండాను ఎగురవేసేలా స్తంభం నిర్మించాలని నిర్ణయించామన్నారు. గురువారం జిన్నా టవర్‌లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
PTI నివేదిక ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం టవర్ పేరును మార్చాలని బిజెపి రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోకుంటే స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
అయితే ఈ అంశాన్ని లేవనెత్తినందుకు బీజేపీ సభ్యుడిపై ముస్తఫా మండిపడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే బదులు కోవిడ్ -19 మహమ్మారి మధ్య నిరుపేదలకు సహాయం చేయడంలో బీజేపీ నాయకులు పాల్గొనాలి” అని ఆయన చెప్పినట్లు ANI పేర్కొంది.
గణతంత్ర దినోత్సవ సంఘటన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు ఉన్న౦దున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే ముస్తఫా, జీఎంసీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో కలిసి మంగళవారం స్మారక చిహ్నాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.