షీనా బోరా సజీవ౦గానే ఉ౦ది: CBI కి లేఖ రాసిన ఇ౦ద్రాణి ముఖర్జియా

Date:

Share post:

2012లో తన 25 ఏళ్ల కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న‌ ఇంద్రాణి ముఖర్జియా, తన కూతురు సజీవంగా ఉందని, కాశ్మీర్‌లో నివసిస్తోందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి లేఖ రాసి మరో స౦చలనానికి తెరలేపి౦ది.

సీబీఐకి పంపిన లేఖ ప్రకారం, తన తోటి ఖైదీ షీనాను కాశ్మీర్ లో కలిసి౦దని, షీనా కదలికలపై సీబీఐ దర్యాప్తు చేయాలని అభ్యర్థించారని మీడియా వర్గాల సమాచార౦.

The Indian Express ప్రకారం… ముఖర్జియా న్యాయవాది సనా రనీస్ ఖాన్ ఆమె సీబీఐకి లేఖ‌ వ్రాసినట్లు ధృవీకరించారు, అయితే “ఆమె వ్రాసిన వాటికి సంబంధించిన వివరాలు మా వద్ద లేవు” అని తెలిపారు. డిసెంబరు 18న ట్రయల్ కోర్టు ముందు అధికారికంగా దరఖాస్తు చేయనున్నట్లు ఖాన్ తెలిపారు. ఇంద్రాణి బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు గత నెలలో తిరస్కరించింది.

అయితే 49 ఏళ్ళ‌ ఇంద్రాణి ముఖర్జీ, తన‌ కుమార్తె షీనా బోరాను 15 ఆగస్టు 2015న హత్య చేసిన కేసులో ఖర్ పోలీసులు అరెస్టు చేశారు మరియు సెప్టెంబర్ 2015 నుండి బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు. ఆమెను అరెస్టు చేసిన మూడు నెలల తర్వాత ఆమె భర్త పీటర్ ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. ఇంద్రాణి హత్యకు సహకరించారనే అభియోగాలు మోపినప్పటికీ 2020 లో అతను బెయిల్ పై విడుదల అయిన స౦గతి తెలిసి౦దే.

ఇంద్రాణి డ్రైవర్‌ శ్యాంవర్‌ రాయ్‌ తుపాకీతో పట్టుబడడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో హత్యను తాను ప్రత్యక్షంగా చూసినట్లు వెల్లడించాడు. ముంబైలోని బాంద్రాలో ముఖర్జీ షీనాను గొంతు కోసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని పొరుగున ఉన్న రాయ్‌గఢ్ జిల్లాలో పారవేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే, ముఖర్జీ ఆ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...