ఏపిలో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల (YS Sharmila AP Congress President) నియమితురాలయ్యే అవకాశాలు ఉన్నాయ్ అని వార్తలు వినిపిస్తూయాయి.
తెలంగాణ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ… ప్రస్తుతం తమ ఫోకస్ ని ఏపి రాయకీయలలో తమ పార్టీ బలోపేతంపై పెట్టినట్లు తెలుస్తోంది.
ఇందుకుగాను రానున్న 2024 ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున షర్మిల ఏపీ నుంచి పోటీ చేస్తారని… త్వరలోనే కొత్త అధ్యక్ష బాధ్యతలు మరియు పొత్తుల పైన ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో స్పష్టం చేసినప్పటికీ… తెలంగాణ ఎన్నికలో తన మద్దతుని కాంగ్రెస్ పార్టీ కి తెలిపి ఎలక్షన్ నుంచి తప్పుకున్న షర్మిలను కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా చేయనున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయ్.
అంతేకాకుండా షర్మిల కనుక ఏపిలో కాంగ్రెస్ పార్టీ భాద్యతలను స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారని భావిస్తున్నట్లు తెల్సుతోంది.
మరి రానున్న ఎన్నికల్లో తన అన్న వైసీపీ అధ్యక్షుడు, ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి పోటీ గా షర్మిల ఎన్నికలో నిలబడుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల! (AP Congress President YS Sharmila !):
#YSSharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల!
వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. pic.twitter.com/8vxlinBCKk
— sonykongara(O positive Blood group) (@andhrudu12) December 26, 2023