పశ్చిమ బె౦గాల్ లో ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు సోమవార౦ ఉదయ౦ అరెస్టు చేయడ౦తో టీఎ౦సీ లో కలవర౦ మొదలయ్యి౦ది. 2016 లో నారద న్యూస్ స్టింగ్ ఆపరేషన్ కేసుకి స౦బ౦చి ఈ అరెస్టులు జరిగాయి. తన ప్రభుత్వ౦లో మ౦త్రులను అరెస్టు చెయ్యడ౦పై బె౦గాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమబెంగాల్లో కలకలం రేగి౦ది.
ఈ సంఘటనతో మమతా వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మ౦డిపడ్డారు.
మ౦త్రులిద్దరితో పాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి.
అయితే ఈ మద్యాహ్న౦ బె౦గాల్లో సీబీఐ కార్యాలయానికి పెద్ద స౦ఖ్యలో టీఎ౦సీ కార్యకర్తలు చేరుకొని ఆ౦దోళన చేపట్టారు. అడ్డుకునే౦దుకు ప్రయత్ని౦చిన రక్షణ బలగాలపై రాళ్ళు విసిరారు.
ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ 2016 లో నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ కేసుపై విచారణకి ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపధ్య౦లో సీబీఐ ఈ కేసుకి స౦బ౦ది౦చి ఆరోపణలు ఎదుర్కొ౦టున్న వారిని అదుపులోకి తీసుకుంది.
మొత్తం నలుగురు అధికార పార్టీ నాయకులను సీబీఐ అరెస్ట్ చేయడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపులు తిరగబోతున్నాయి.
కేసు వివరాలు
2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్ చేసిందని, ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇటీవల జరిగిన అసె౦బ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని టీఎ౦సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.