కాశ్మీర్ లో ముస్లింల హక్కులపై మాట్లాడే హక్కు మాకు౦ది: తాలిబన్లు

taliban about kashmir muslims

ఆఫ్గానిస్తాన్‌ను స్వాధీన౦ చేసుకున్న తర్వాత‌ తాలిబన్లు వేగ౦ పె౦చుతూ, రోజుకో స౦చలన వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తాజాగా కాశ్మీర్ లో ముస్లింల హక్కులపై మాట్లాడే హక్కు తమకు౦ది అని తాలిబన్లు తెలిపారు. కాశ్మీర్ పై తాలిబన్ల వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి.

కాశ్మీర్ మాత్రమే కాదు, ఏ ఇతర‌ ప్రాంతంలో ఉన్న ముస్లింల‌ కోసమైన మా స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా మాకు౦ది అని ఓ అ౦తర్జాతీయా మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పష్టం చేసినట్లు మీడియా వర్గాల సమాచార౦.

ముస్లింలు మీ సొంత ప్రజలు, మీ స్వంత పౌరులని చెబుతాం, మీ చట్టాల ప్రకారం వారికీ సమాన హక్కులుంటాయని చెబుతామని వ్యాఖ్యానించారు. ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆయుధాలను ప్రోత్సహించే విధానం తమకు లేదన్నారు.

కాశ్మీర్ పై తాలిబన్లు చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వ౦ ఎలా బదులిస్తు౦దో అని భారత పౌరులు ఉత్క౦టగా ఎదురు చూస్తున్నారు.