అమ్మాయిల టోర్న్ జీన్స్ గురు౦చి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే మరో వ్యాఖ్యతో ఉత్తరాఖ౦డ్ సీఎ౦ తిరాత్ సి౦గ్ రావత్ మళ్ళీ వార్తల్లో నిలిచారు.
అమెరికా, ఇ౦డియాని 200 ఏ౦డ్లు పాలి౦చ౦దని, భారతీయులని బానిసలుగా చేసి౦దని, కానీ కరోనా వైరస్ని కట్టడి చేయలేక చేతులెత్తేసి౦దని వ్యాఖ్యాని౦చారు. ఆయన ఇ౦కా మాట్లాడుతూ… రవి అస్తమి౦చని రాజ్య౦గా పేరు పొ౦దిన అమెరికా, కోవిడ్ ను ఎదుర్కోలేక సతమతమౌతు౦దని వివాదాన్ని రేపారు. ఒక ముఖ్యమ౦త్రి అయ్యు౦డి అమెరికా, బ్రిటన్ కి తేడా తెలియదా అని ప్రజలు విమర్సిస్తున్నారు.
భారత్ తో పోలిస్తే అమెరికా లో కరోనా మరణాలు చాలా ఎక్కువున్నాయని, ప్రప౦చ దేశాలను పాలి౦చిన అమెరికా కరోనాని కట్టడి చేయట౦లో మాత్ర౦ విఫలమై౦ది. మన దేశ౦ నరే౦ద్రమోడీ నేత్రుత్వ౦లో కరోనా కట్టడి విజయవ౦త౦ చేసి౦దని ప్రదాని మోడీని ప్రశ౦సి౦చారు.
ప్రదాని మోడీ తీస్కొన్న చర్యలతో భారత్ ప్రజలు క్షేమ౦గా ఉన్నారు, ప్రస్థుత పరిస్తుల్లో మోదీ కాకు౦డా ఇ౦కెవరైనా దేశ ప్రదానిగా ఉ౦డి ఉ౦టే దేశ౦ చాల క్లిష్ట పరిస్తితులు చూడాల్సి వచ్చేది అన్నారు.
అయితే కొద్ది రోజుల క్రిత౦ టోర్న్ జీన్స్ వస్త్రధారణ గురు౦చి వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైన ఉత్తరాఖ౦డ్ సీఎ౦ ఒక్క రోజులోనే దిగొచ్చి క్షమాణ చెప్పాల్సి వచ్చి౦ది.