Tula Uma resigns BJP: తెలంగాణలో ఎన్నికల ముందు బీజేపీ పార్టీ కు పెద్ద దెబ్బె తగిలింది. బీజేపీ పార్టీ కి తుల ఉమా రాజీనామా చేసింది.
అధిష్టానం వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ ప్రకటించింది… అయితే చివరి నిమిషంలో బీఫామ్ తన స్థానంలో చెన్నమనేని వికాస్ రావు కు ఇవ్వడంతో రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
వేములవాడ టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ అధిష్టానానికి ఉమ లేఖ రాశారు. ఈ లేఖలో బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా బీసీ బిడ్డనైన తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని లేఖలో చెప్పుకొచ్చారు.
కాగా నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో తుల ఉమ బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.
తుల ఉమ రాజీనామా (Tula Uma resigns BJP):
బీజేపీకి తుల ఉమ రాజీనామా.. వేములవాడ టికెట్ ఇచ్చి బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో బీజేపీకి గుడ్ బై చెప్పిన తుల ఉమ.. #TelanganaAssemblyElections2023 #BJP #tulauma
— NTV Breaking News (@NTVJustIn) November 13, 2023
ALSO READ: తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చెయ్యట్లేదు… కాంగ్రెస్ కే పూర్తి మద్దతు: షర్మిల