Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో అంతటా టెన్షన్ టెన్షన్. మొన్న (డిసెంబర్ 30న) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది వచ్చేది ఎవరు?.. కాంగ్రెస్సా? బీఆర్ఎస్సా? రేపు విడుదల కానున్న ఎన్నికల ఫలితాల (Telangana Elections Results) కోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఇదే చర్చ కొనసాగుతోంది. అయితే ఈ పోటీలో బీజేపీ పార్టీ ఊసే లేకపోవడం గమనార్హం
ఎన్నికల ప్రక్రిక ముగిసిన వెంటనే పలు మీడియా సంస్థలు వేదాల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా వచ్చాయి. రాష్ట్ర ప్రజలు మాత్రం కొంతమంది ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అంటుంటే… మరికొంతమంది మాత్రం ఎగ్జిట్ పోల్స్ (Exit Polls 2023) ఆధారంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఈసారి రాష్ట్రంలో విజయకేతనాన్ని ఎగురవేస్తుంది అని అంటున్నారు. ఇకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ముందుకి వచ్చిన బీజేపీ పార్టీ ఈసారి కనీసం ఐదు స్థానాలలో విజయం సొంతం చేస్కోవడం కష్టమే అనిపిస్తోంది.
నువ్వా?…నేనా? (BRS v/s Congress)
తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా అధికారం లోకి వస్తే… వరుసగా మూడో సారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పదవి దక్కించుకున్న మొట్టమొదటి ముఖ్య మంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు. ఒకవేళ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నెగ్గితే… తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని చేపడుతుంది.
మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని దక్కించుకుంటుందా? కేసీఆర్ హాట్ట్రిక్ సీఎం అయ్యేనా? లేదా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమై కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందా? ఇవన్నీ తేలాలంటే రేపటిదాకా వేచి ఉండాల్సిందే.
ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls 2023)
#LIVE | KCR's BRS Trailing in Telangana, Predicts Today's Chankaya
According to News24's Today's Chankaya, K Chandrasekhar Rao's #BRS party is trailing behind the Congress.#TelanganaExitPolls2023 live updates: https://t.co/81C6KuKsYL pic.twitter.com/wQSOWUgomW
— The Quint (@TheQuint) November 30, 2023
ALSO READ: తెలంగాణ ఎన్నికలు 2023: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే