సూర్యాపేటలో నిర్వహిస్తున్న‌ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి

ప్రమాద సమయంలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలినట్లు తెలుస్తు౦ది.

Date:

Share post:

సూర్యాపేటలో నిర్వహిస్తున్న‌ 47వ‌ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలినట్లు తెలుస్తు౦ది.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి

ప్రమాద‌ ఘటనపై మంత్రి జగదీశ్‌ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

స్టేడియం ప్రమాదం పట్ల గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి

సూర్యాపేటలోని కొత్తగా నిర్మించిన స్టేడియంలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదం పట్ల తెల౦గాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజ న్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయ పడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles