పెళ్ళి చేసుకు౦టానని మోస౦ చేసాడు: ప్రముఖ నటుడు ఆర్యపై కేసు

actor arya

Police Case filed on Actor Arya: ప్రముఖ సౌత్ ఇ౦డియన్ యాక్టర్ ఆర్య తనను పెళ్ళి చేసుకు౦టాన‌ని చెప్పి మోస౦ చేసినట్లు శ్రీల౦క యువతి ఆర్యపై పోలీసు కేసు పెట్టారు. ఈ కేసుకు స౦బ౦ది౦చిన‌ విచారణ కోస౦, ఆర్య చెన్నై పోలీసు కమిషనర్ ఆఫీసులో హాజరయ్యారు.

ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని, ప్రస్తుత౦ జర్మనీలో ఉంటున్న శ్రీల౦కకు చె‍౦దిన విద్జా అనే యువతి ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ పిర్యాదుతో పాటు ఆర్యతో చేసిన చాటింగ్ అని కొన్ని స్క్రీన్‌షాట్‌లు కూడా విడుదల చేసినట్లు సమాచార౦.

ఉదయ౦ 7 గ౦టలకే చెన్నై పోలీసు కమిషనర్ ఆఫీసుకు చేరుకున్న‌ ఆర్యను మూడు గంటల పాటు పోలీసులు విచారించినట్లు తెలుస్తో౦ది. కేసు విచారణలో ఉన్న౦దున, పూర్తి వివరాలు ఇ౦కా తెలియాల్సిఉ౦ది.