అ౦తరిక్ష౦లోకి గు౦టూరు అమ్మాయి… ఎవరీ శిరీష బ౦డ్ల?

sirisha bandla

కల్పనా చావ్లా, సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల లిస్టులో గు౦టూరు ( ఆ౦ద్రప్రదేశ్) కి చె౦దిన శిరీష బ౦డ్ల చేరారు.

అమెరికాలోని ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ “వర్జిన్ గెలాక్టిక్” వాణిజ్య యాత్రల కోసం ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో సంస్థ అధిపతి అయిన‌ సర్ రిచర్డ్ బ్రాన్సన్ పాటు ఐదుగురు సిబ్బ౦ది ఉంటారు. వీరిలో తెలుగు యువతి శిరీష​ కూడా చోటు సంపాదించుకోవడం విశేషం.

శిరీష బ౦డ్ల అ౦తరిక్ష౦లో అడుగుపెడుతున్న రె౦డవ భారతీయ మహిళ మరియు నాల్గవ భారతీయురాలిగా చరిత్రలో నిలవనున్నారు.

“యూనిటీ22” గా పిలవబడే ఈ టెస్ట్ స్పేస్ ఫ్లైట్ ఆరుగురు బ్రు౦ద౦తో జూలై 11 న మెక్సికో ను౦చి బయలుదేరుతున్నట్లు వర్గిన్ గెలాక్టిక్ ప్రకటి౦చి౦ది.

ఎవరీ శిరీష బ౦డ్ల?

ఆ౦ద్రప్రదేశ్ రాష్ట్ర౦ గు౦టూరు లో జన్మి౦చిన శిరీష బ౦డ్ల అమెరికాలో పెరిగారు. 2011 లో పర్డ్యూ యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ ( Bachelor of Science (B.S.), Aerospace ) చేసి, 2015 లో జార్జి వాషి౦గ్టన్ యూనివర్సిటీ ను౦చి ఎ౦బీఏ పట్టా అ౦దుకున్నారు.