Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (CSK vs PBKS) స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా (Fine) విధించారు. ఈ నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
₹24 లక్షల జరిమానా (Shreyas Iyer Fine IPL 206)?
నిన్న IPL 2026లో భాగంగా CSK మరియు PBKS తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని PBKS జట్టు నిర్ణీత సమయానికి 20 ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో, శ్రేయస్ అయ్యర్‌కు ₹24 లక్షల జరిమానా విధించబడింది.
అలాగే PBKS టీంలో ఉన్న ప్లేయింగ్ 11 కు కూడా జరిమానా విధించడమైంది. వీరికి ఒక్కొక్కరికి మ్యాచ్ ఫీజులో 25% లేదా ₹6 లక్షలు జరిమానా విధించారు.
వరుసగా రెండో తప్పిదం (Second Fine)
ఇదిలాఉండగా… శ్రేయస్ అయ్యర్‌కు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడటం IPLలో పెద్ద చర్చగా మారింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో (GT vs PBKS) కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్ కు 12 లక్షల జరిమానా విధించడమైంది. దీనితో ఇప్పటికే అయ్యర్ రెండు సార్లు జరిమానా కు గురైయ్యాడు. మూడోసారి గనుక ఈ పొరపాటు జరిగితే మ్యాచ్ సస్పెన్షన్ కి కూడా గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి? (What is Slow Over Rate)?
స్లో ఓవర్ రేట్ అంటే ఒక జట్టు నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయకపోవడం. ఇది కేవలం సమయానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మ్యాచ్ ఫ్లోపై కూడా ప్రభావం చూపుతుంది.
అయ్యర్ కు జరిమానా (Shreyas Iyer Fined)?
12 LAKHS FINE FOR SHREYAS IYER. 💰
– Iyer becomes the first captain to be fined 12 Lakhs for maintaining slow overrate. pic.twitter.com/q41SS3Dg5m
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2026




