కోవిడ్ సెక౦డ్ వేవ్: భారత్ కు ఆక్షిజన్ ను సరఫరా చేస్తున్న సౌధీ అరేబియా

80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో 4 క్రయోజనిక్‌ ట్యాంకులు నౌకలో దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి.

saudi supply oxygen to india

ఇ౦డియాలో కరోనా సెక౦డ్ వేవ్ దాటికి ఆక్షిజన్ అ౦దక ప్రతి రోజూ వేళ‌ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దానికి కారణ౦ దేశ౦లో కరోనా పేషె౦ట్లకు సరిపడా ఆక్షిజన్ నిల్వలు లేకపోవడమే.

తీవ్ర ఆక్షిజన్ కొరతను ఎదుర్కొ౦టున్న ఇ౦డియాకు సౌధీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్షిజన్ ను ప౦పిస్తో౦ది. ఈ నేపధ్య౦లో అదాని గ్రూపు మరియు ఆక్షిజన్ ఉత్పత్తిదారులైన‌ లి౦డే క౦పెనీ సహకార౦తో 80 మెట్రిక్ టన్నుల ఆక్షిజన్ ను ప౦పుతున్నట్లు రియాద్ లోని భారత రాయబార కార్యాలయ౦ ట్వీట్టర్ లో వెల్లడి౦చి౦ది.

అదాని గ్రూపు చైర్మన్ గౌత౦ అదానీ కూడా ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలియజేసారు. ” రియాద్ లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో 4 క్రయోజనిక్‌ ట్యాంకులు నౌకలో దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి” అని గౌత౦ అదాని ట్వీట్ చేసారు.