Sahara Group Chairman Passed Away:సహారా గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10:30 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రతా రాయ్ మంగళవారం రాత్రి గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు సహారా గ్రూప్ ప్రకటించింది.
బీహార్‌లోని ఆరారియాలో 1948 జూన్ 10న జన్మించిన సుబ్రతా రాయ్… గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.
అనంతరం 1976లో ‘సహారా ఫైనాన్స్’ పేరుతో చిన్న చిట్ ఫండ్ కంపెనీని రాయ్ స్థాపించారు. తరువాత దీనిని 1978లో సహారా పరివార్‌గా మార్చారు.
ఇదిలా ఉండగా సహారా ఇండియాలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆయన పై కేసులు నమోదయ్యాయి. సెబీ కేసులో కోర్టులో హాజరుకానందుకు ఆయన్ని అరెస్టు చేయాలని 2014లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
దీంతో అతడు తీహార్ జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత పెరోల్‌పై సుబ్రతా రాయ్ విడుదలయ్యారు.
సహారా గ్రూప్ అధినేత కన్నుమూత (Sahara group Chairman Subrata Roy passed away):
Sahara Group Managing Worker and Chairman Subrata Roy passes away due to cardiorespiratory arrest: Sahara Group pic.twitter.com/ugUdBrxiSp
— ANI (@ANI) November 14, 2023
ALSO READ: కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య