ముంబైలో విషాదం, లిఫ్ట్ కూలి ఏడుగురు కార్మికులు మృతి

Date:

Share post:

Mumbai Lift Collapses: మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. ఓ హైరైజ్ అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతువాత పడ్డారు.

ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం, కార్మికులు లిఫ్ట్ లో టెర్రస్ నించి కిందకి వస్తుండగా జరిగిందని థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు.

సాక్షి కధనం ప్రకారం, థానేలోని హోంబందర్ రోడ్డులో ఒక నలభై అంతస్థుల భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం భవనం పైకప్పుపై వాటర్‌ఫ్రూఫింగ్ పనులు జరుగుతున్నాయి. సాయంత్రం ఐదున్నర సమయంలో పనులు ముగించుకుని కార్మికులు లిఫ్ట్ లో టెర్రస్ పైనుంచి కిందకి లిఫ్ట్ లో వస్తున్నారు. ఆ సమయంలో లిఫ్ట్ లోని సపోర్టింగ్ కేబుల్ ఒకటి తెగిపోవడంతో అకస్మాత్తుగా కిందకి పడిపోయింది.

లిఫ్ట్ బలంగా గ్రౌండ్ థర్డ్ లెవెల్ కు తాకడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా మరణించారు.

ఇది సాధారణ ఎలివేటర్ కాదు:

థానే డిసాస్టర్ మానేజ్మెంట్ సెల్ అధికారి యాసిస్ తాడివి ఈ ఘటనపై స్పందిస్తూ ‘ ఇది ఒక నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదు’ అని తెలిపారు. లిఫ్ట్ 40 వ అంతస్థు నుంచి అమాంతం గా P3 ( అండర్ గ్రౌండ్ థర్డ్ లెవెల్ పార్కింగ్ లెవెల్ ) కు పడిపోయింది అని పేర్కొన్నారు.

అయితే లిఫ్ట్ అమాంతం కూలిపోవడానికి గల కారణాలకు గాను అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు.

ALSO READ: మొరాకోలో భారీ భూకంపం, 300 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసేసుకుంది. నదియాడ్‌లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొటింది (Gujarat Ahmedabad-Vadodara...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...