తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను తెలంగాణ సచివాలయంలో బుధవారం శంకుస్థాపన కూడా చేసేశారు (Revanth Reddy laid foundation to Rajiv Gandhi statue at Telangana Secretariat).
ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయని.. అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందని రేవంత్ రెడ్డి శంకుస్థాపన సందర్భంగా తెలిపారు.
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ. అలాగే దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
(Rajiv Gandhi statue at Telangana Secretariat)
Hon'ble CM laying foundation stone for the statue of former Prime Minister Late Sri Rajiv Gandhi. https://t.co/Sqj7KneJjf
— Revanth Reddy (@revanth_anumula) February 14, 2024
సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దాని స్థానంలో బీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని అయన కోరారు.
సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి..
కేసీఆర్ గారి హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి.
– ఎమ్మెల్యే @PRR_BRS pic.twitter.com/DDlgHJMhwK
— BRS Party (@BRSparty) February 14, 2024
ALSO READ: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ…ప్రకటించిన రిటైర్డ్ ఐఏఎస్