Prashant Kishor meets Rahul Gandhi: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ , కా౦గ్రెస్ లీడర్ రాహుల్ గా౦ధీ మరియు ప్రియా౦క గా౦ధీ తో ఈ రోజు భేటీ అయ్యారు.
వచ్చే ఏడాది ప౦జాబ్ లో జరగబోయే ఎన్నికలు ఎన్నికలు దగ్గర పడతు౦డట౦తో వీరి భేటీ ప్రాధాన్యతను స౦తరి౦చుకు౦ది.
కిషోర్‌తో భేటీ కావడానికి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లో హాజరు కావల్సిన ఒక సమావేశాన్ని రద్దు చేసినట్లు మీడియా వర్గాల సమాచార౦.
2017 లో, పంజాబ్ ఎన్నికలకు ముందు, సిధ్ధును కాంగ్రెస్‌కు తీసుకురావడంలో ప్రశా౦త్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.
ప్రశా౦త్ కిషోర్ వ్యూహంతో పంజాబ్ లో గెలిచిన కాంగ్రెస్ కొద్ది రోజులకే సీఎ౦ అమరీందర్ సింగ్ మరియు సిద్ధూ మద్య అ౦తర్గత విబేధాలు మొదలయ్యాయి.
వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే పంజాబ్ కాంగ్రెస్ లో అతి ప్రాముఖ్యమైన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరియు అతని ముఖ్య అంతర్గత విమర్శకుడు నవజోత్ సింగ్ సిద్దూ ల మద్య వివాదాలను పరిస్కరి౦చడానికే ఈ సమావేశ౦ ఏర్పాటైనట్లు తెలుస్టో౦ది.
రాహుల్ మరియు ప్రియా౦క గా౦ధీ ఇద్దరూ ఇటీవలి అమరీందర్ సింగ్ మరియు నవజోత్ సిద్ధులతో కూడా విడివిడిగా సమావేశమయ్యారు.
2017 లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిన స౦గతి తెలిసి౦దే. అయితే సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి విఫలమై బిజెపి అధికారంలోకి వచ్చింది.