Modi Cabinet Reshuffle: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు ( బుధవారం) సాయంత్రం 6 గంటలకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. రెండవసారి ప్రధాని అయిన తర్వాత మొదటి సారిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరిస్తున్నారు.
ఈ రోజు ప్రకటించబోయే కొత్త మంత్రివర్గంలో, నిరుపేద మరియు గిరిజన వర్గాల ప్రాతినిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
కొత్త మంత్రివర్గంలో 81 మంది సభ్యులు భాగం కానున్నట్లు సమాచారం. ఈ విషయంలో గత కొన్ని వారాలుగా పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జెపి నడ్డా పలు సమావేశాలు నిర్వహించారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉన్నట్లు ప్రముఖ డిజిటల్ మీడియా “డీఎన్ఏ” తెలిపి౦ది.