మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు

Date:

Share post:

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

న్యాయవాది పీటర్ మైలిపరంబిల్‌పై జస్టిస్ పివి కున్హికృష్ణన్ ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా విధి౦చి౦ది. ఇది నిగూఢ ఉద్దేశాలతో దాఖలు చేసిన పనికిమాలిన పిటిషన్ అని, భారీ ఖర్చుతో కూడిన ఫిట్ కేసును కొట్టివేయాలని పేర్కొ౦ది. “పిటిషనర్‌కు రాజకీయ ఎజెండా కూడా ఉందని నాకు బలమైన సందేహం ఉంది” అని న్యాయమూర్తి అన్నారని The Indian Express తెలిపి౦ది.

అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని ఫోటో ఉండటం తన‌ గోప్యతకు భంగం కలిగించడమేనని పిటిషనర్ వాదించారు.

భారత ప్రధానిని గౌరవించడం పౌరుల కర్తవ్యం

న్యాయమూర్తి తన తీర్పులో, “భారత ప్రధానిని గౌరవించడం పౌరుల కర్తవ్యం. అయినప్పటికీ వారు ప్రభుత్వ విధానాలపై మరియు ప్రధానమంత్రి రాజకీయ వైఖరిపై విభేదించవచ్చు. ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్నది పౌరుల సంక్షేమం కోసం కాదని వారు పౌరులను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మహమ్మారి పరిస్థితిలో ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధానమంత్రి ఫోటోతో కూడిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడానికి పౌరులు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పిటిషనర్ ఆరోపించినట్లు అటువంటి పరిస్థితిలో ప్రాథమిక హక్కు లేదా నిర్బంధ వీక్షణ వంటి మరే ఇతర హక్కుకు భంగం కలగదు” అని అన్నారు.

“క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వేలాది మంది వ్యక్తులు మన దేశంలో జైళ్లలో వారి అప్పీళ్లను వినడానికి వేచి ఉన్నారు. వేలాది మంది ప్రజలు తమ వివాహ వివాదాలలో ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఆస్తి వివాదాల ఫలితం కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ కోర్టు ఆ వ్యాజ్యాలను వీలైనంత త్వరగా పరిగణించాలి మరియు ఈ కోర్టు ప్రతిరోజూ ఆ పని చేస్తోంది. అటువంటి పరిస్థితిలో, పనికిమాలిన పిటిషన్లు దాఖలైనప్పుడు, దానిని భారీ ఖర్చుతో కొట్టివేయాలి” అని న్యాయమూర్తి పునరుద్ఘాటి౦చారు.

కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (ASGI) S.మను వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లోని ప్రధాని ఫోటో సందేశంతో వస్తుందని, టీకా సర్టిఫికేట్ ద్వారా ఆయన‌ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే

పిటిషనర్‌పై తీవ్రంగా స్పందించిన కోర్టు, పిటిషనర్ కనీసం పార్లమెంటరీ కార్యక్రమాలను జాతీయ టీవీలో ప్రత్యక్షంగా చూడటం ద్వారా ప్రధాని మరియు ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని అధ్యయనం చేయాలని పేర్కొంది. ‘‘ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ వారు ప్రధానిని ‘గౌరవనీయ ప్రధానమంత్రి’ అని సంబోధిస్తారు’’ అని కోర్టు పేర్కొంది.

భారత ప్రజాస్వామ్య చరిత్రను అధ్యయనం చేయాలని పిటిషనర్‌ను కోరిన న్యాయమూర్తి, భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో జవహర్‌లాల్ నెహ్రూ అధికారంలోకి వచ్చినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తుచేశారు. 16 మంది సభ్యులతో, “ప్రతిపక్ష నేత పదవిని పొందడానికి ఇది సరిపోదు”.

“అయిన‌ప్పటికి కూడా, నెహ్రూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించారు మరియు పార్లమెంటులో ఓపికగా వినేవారు. పరస్పర గౌరవం ప్రజాస్వామ్యంలో భాగం. లేని పక్షంలో అది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అవుతుంది’’ అని కోర్టు పేర్కొంది.

గత వారం, మైలిపరంబిల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు, హైకోర్టు పిటిషనర్‌ను ఇలా ప్రశ్నించింది: “మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రతి ఒక్కరికీ భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఆయన (మోదీ) ఇప్పటికీ మన దేశ‌ ప్రధానమంత్రి” అని అన్నారు.

పిటిషనర్ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని పేర్కొన్న న్యాయమూర్తి, వ్యాక్షీన్ పై ప్రధాని ఫోటో విషయ౦లో 100 కోట్ల మంది ప్రజలకు ఎలాంటి సమస్య కనిపించడం లేదని అన్నారు. కానీ మీకు ఎ౦దుకు సమస్య ఉ౦దో? నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను” అని అన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్‌ మెసేజ్ చూసి...

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న...

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...