Mumbai Lift Collapses: మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. ఓ హైరైజ్ అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతువాత పడ్డారు.
ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం, కార్మికులు లిఫ్ట్ లో టెర్రస్ నించి కిందకి వస్తుండగా జరిగిందని థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు.
సాక్షి కధనం ప్రకారం, థానేలోని హోంబందర్ రోడ్డులో ఒక నలభై అంతస్థుల భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం భవనం పైకప్పుపై వాటర్‌ఫ్రూఫింగ్ పనులు జరుగుతున్నాయి. సాయంత్రం ఐదున్నర సమయంలో పనులు ముగించుకుని కార్మికులు లిఫ్ట్ లో టెర్రస్ పైనుంచి కిందకి లిఫ్ట్ లో వస్తున్నారు. ఆ సమయంలో లిఫ్ట్ లోని సపోర్టింగ్ కేబుల్ ఒకటి తెగిపోవడంతో అకస్మాత్తుగా కిందకి పడిపోయింది.
లిఫ్ట్ బలంగా గ్రౌండ్ థర్డ్ లెవెల్ కు తాకడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా మరణించారు.
ఇది సాధారణ ఎలివేటర్ కాదు:
థానే డిసాస్టర్ మానేజ్మెంట్ సెల్ అధికారి యాసిస్ తాడివి ఈ ఘటనపై స్పందిస్తూ ‘ ఇది ఒక నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదు’ అని తెలిపారు. లిఫ్ట్ 40 వ అంతస్థు నుంచి అమాంతం గా P3 ( అండర్ గ్రౌండ్ థర్డ్ లెవెల్ పార్కింగ్ లెవెల్ ) కు పడిపోయింది అని పేర్కొన్నారు.
అయితే లిఫ్ట్ అమాంతం కూలిపోవడానికి గల కారణాలకు గాను అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW
— ANI (@ANI) September 10, 2023
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు.
Shocking!
The lift accident in Thane is very tragic.
I express my deepest condolences to the families of the deceased who lost lives in this accident.
Wishing speedy recovery to the injured ones. https://t.co/xIRWwP6gBD— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 10, 2023
ALSO READ: మొరాకోలో భారీ భూకంపం, 300 మంది మృతి