మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి రాహుల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలలో నిరంతరం తనిఖీలు చేస్తూ అక్కడ భోధన పద్ధతులు మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.
ఈ కార్యక్రమం లో భాగంగా అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఒక ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలోని ఒక తరగతి గదికి వెళ్లి అక్కడ ఉన్న విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విద్యార్థుల సమాధానాలు ఆయనను ఆకట్టుకోవడంతో అక్కడ అధ్యాపకులను ఎంతగానో మెచ్చుకున్నారు.
అంతటితో ఆగకుండా తన స్వహస్తాలతో ప్రధాన అధ్యాపకురాలు సునీత గారిని అభినందిస్తూ ఒక లేఖను రాసారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఈ లేఖలో విద్యార్థుల సమాధానాలు మరియు ఒక విద్యార్థి పాడిని జయ జయహే తెలంగాణ పాట ఎంతగానో నచ్చింది అని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలో పని చేస్తున్న అధ్యాపకులు మరియు స్టాఫ్ ను వారి పని తీరుని మెచ్చుకుని ఏది ఇలానే ముందుకు కొనసాగాలి అని సూచించారు.
అలాగే జిల్లా పరిధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శకులకు ఒక ఆన్లైన్ క్విజ్ ని నిర్వహించారు. ఈ క్విజ్ కు సంబందించిన 25 ప్రశ్నలను తానే స్వయంగా సిద్ధం చెయ్యడం గమనార్హం. ఈ క్విజ్ లో కార్యదర్శకుల నిరంతర విధులు మరియు పంచాయతీ రాజ్ చట్టం పైన ప్రశ్నలు రూపొందించారు. పరీక్షా సమయం 20 నిమిషాలు.
పరీక్షలో పాల్గొన్న కార్యదర్శకుల నైపుణ్యం బట్టి వారికీ శిక్షణ కార్యక్రమాలు అందించే ఉద్దేశ్యంతో ఈ క్విజ్ ను నిర్వహించారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రారంభించిన రాహుల్ ను అభినందిస్తూ ప్రజలు ఆయనపట్ల హర్షం వ్యక్తపరిచారు.