ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ (Former IAS officer Vijay Kumar) ‘లిబరేషన్ కాంగ్రెస్’ (Liberation Congress party) పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించారు.
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ వద్ద జరిగిన అధిక జన మహా సంకల్ప సభలో విజయ్ కొత్త కొత్త పార్టీని ప్రకటన చేశారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతోందని ఆయన తెలిపారు. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ (Liberation Congress):
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. | Liberation Congress – TV9#LiberationCongress #andhrapradesh #tv9telugu pic.twitter.com/BfSKG9bHKO
— TV9 Telugu (@TV9Telugu) February 14, 2024
ALSO READ: ప్రముఖ నటి జయప్రద కు అరెస్ట్ వారెంట్