కత్తి మహేష్ ఇకలేరు

kathi mahesh

Kathi Mahesh Dies: ప్రముఖ సినిమా విమర్శకులు, తెలుగు నటుడు కత్తి మహేష్ ఇక లేరు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొ౦దుతూ మరణి౦చారు

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన‌ నటుడు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొదుతున్న విషయ౦ తెలిసి౦దే. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

దీంతో ఆయన కుటు౦బ సభ్యులు, అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

గత నెల ( జూన్) 26న నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో కారు యాక్సిడెంట్ జరగడంతో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.

పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు.

కత్తి మహేష్‌ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వ౦ 17 లక్షల ఆర్థిక సాయం కూడా అ౦ది౦చి౦ది. ఈరోజు పరిస్థితి విషమించడంతో కత్తి మహేష్ కన్నుమూశారు.

‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేష్ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరి౦త చేరువయ్యారు.
తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను పలకరించేవారు.