విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad Decline) అవుతున్నట్టు కనిపిస్తోంది. గత మూడేళ్లలో భారతదేశం నుంచి విదేశాలకు చదువుకోడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య (Indian Students Abroad) తగ్గుతున్నట్లు తాజా ప్రభుత్వ గణాంకాలు తెలిపుతున్నాయి.
మీడియా సమాచారం ప్రకారం… 2023లో సుమారు 9.08 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లగా. 2024లో ఈ సంఖ్య 7.7 లక్షలకు తగ్గింది. అయితే 2025లో ఈ సంఖ్య ఇంకా తగ్గి 6.26 లక్షలకు చేరింది. అంటే గత 3 సంవత్సరాలలో సుమారు 31% తగ్గుదల నమోదయినట్లు తెలుస్తోంది.
భారతీయ విద్యార్థులు విదేశాలకు ఎందుకు తగ్గుతున్నారు? (Why Indian students going abroad Decreasing)
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తగ్గుదలకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి:
విదేశీ విద్య ఖర్చులు పెరగడం – ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి.
వీసా నియమాలు కఠినతరం కావడం – కొన్ని దేశాలు విద్యార్థి వీసా ఇవ్వడంలో కఠిన నియమాలు పెట్టాయి.
భారతదేశంలో మంచి విద్యా అవకాశాలు పెరగడం – కొత్త యూనివర్సిటీలు, అంతర్జాతీయ కోర్సులు పెరుగుతున్నాయి.
విదేశాల్లో ఉద్యోగాలపై అనిశ్చితి – చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరుకుతుందా అనే సందేహం.
మొత్తంగా చూస్తే విదేశాల్లో చదవాలనే ఆసక్తి ఇంకా ఉన్నప్పటికీ, ఖర్చులు మరియు నియమాలు పెరగడం వల్ల విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గత కొంత కాలంగా తగ్గుదల కనిపిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
మూడేళ్లలో తగ్గిన స్టడీ అబ్రాడ్ ట్రెండ్ (Indian Students Abroad Decline 31% Since 2023):
🚨Indian Students going abroad drop 31% in two Years-
2025: 6.26 Lakh
2024: 7.7 Lakh
2023: 9.08 Lakh— Indian Infra Report (@Indianinfoguide) February 25, 2026
🚨 Indian students going abroad for education.
2023: 9.08 lakh
2024: 7.7 lakh
2025: 6.26 lakh
The number of students going abroad is declining.
— Indian Tech & Infra (@IndianTechGuide) March 11, 2026
ALSO READ: హైదరాబాద్లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు




