జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో భారత్ విజయకేవతనం ఎరగవేసింది (India beat Zimbabwe by 100 runs). దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భారత్ బోణి కొట్టింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో గిల్ తక్కువ పరుగులకే నిష్క్రమించినప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ మరియు ఋతురాజ్ దూకుడు బ్యాట్టింగ్ తో జట్టు స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. ముఖ్యంతో ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే అభిషేక్ (100) సెంచరీ చేసి నిష్క్రమించాడు.
అయితే అభిషేక్ శర్మ అవుట్ అయ్యినప్పటికీ తరువాత వచ్చిన రింకు సింగ్ తో ఋతురాజ్ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సఫలం అయ్యారు. టు డౌన్ లో బ్యాట్టింగ్ కు వచ్చిన రింకు సింగ్ కేవలం 22 బంతులలోనే 48 పరుగులు చేసాడు.
అనంతరం ౨౩౫ పరుగుల భారీ లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగింది జింబాబ్వే. ఓపెనర్ మాదేవేరి, వన్ డౌన్ లో వచ్చిన బెన్నెట్ కాసేపు మెరుపులు మెరిపించి పెవిలిన్ బాట పట్టారు. అయితే తరువాత బ్యాట్టింగ్ వచ్చిన జింబాబ్వే బ్యాటర్లు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయక పోవడంతో జింబాబ్వే 18.4 ఓవర్లలోనే 134 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో విజయంతో ఇరు జట్టు ఒక్కో మ్యాచ్ గెలుచుకుని సిరీస్ 1-1 సమానంగా ఉన్నారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (100 పరుగులు 47 బంతులు )
రెండో టీ20లో భారత్ విజయం (IND vs ZIM: India beat Zimbabwe in 2nd T20)
Win in the 2nd T20I ✅
Strong bowling performance 👌
3️⃣ wickets each for @ksmukku4 and @Avesh_6
2️⃣ wickets for Ravi Bishnoi
1️⃣ wicket for @Sundarwashi5Scorecard ▶️ https://t.co/yO8XjNqmgW#TeamIndia | #ZIMvIND pic.twitter.com/YxQ2e5vtIU
— BCCI (@BCCI) July 7, 2024
ALSO READ: టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు